Share News

పోర్టు పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:50 AM

బందరు పోర్టు, ఫిషింగ్‌ హార్బర్‌ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. గురువారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మచిలీపట్నం నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌ డీకే బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ, ఆర్డీవో స్వాతిలతో సమీక్షించారు.

పోర్టు పనులు వేగవంతం చేయాలి
కలెక్టర్‌ బాలాజీ, జేసీ గీతాంజలి శర్మలతో సమీక్షిస్తున్న మంత్రి రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : బందరు పోర్టు, ఫిషింగ్‌ హార్బర్‌ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. గురువారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మచిలీపట్నం నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌ డీకే బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ, ఆర్డీవో స్వాతిలతో సమీక్షించారు. బందరు పోర్టు నిర్మాణం పూర్తవుతున్న దృష్ట్యా మచిలీపట్నంను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు, ఉపాధి అవకాశాలు లభించేందుకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. గిలకలదిండి ప్రాంతంలో ఎంఎ్‌సఎంఈ పార్కు అభివృద్ధి చేస్తే బాగుంటుందని, అందుకు గల అవకాశాలను పరిశీలించాలన్నారు. ఇందుకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలన్నారు. చేతి వృత్తుల వారికి జీవనోపాధి కల్పించేందుకు అవసరమైన శిక్షణతో పాటు యూనిట్ల స్థాపనకు ప్రణాళిక రూపొందించాలన్నారు. మత్స్యకారుల జీవనోపాధి కోల్పోకుండా క్టస్టర్‌ రూపొందించి పడవల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. మత్స్యకారులకు శిక్షణా కార్యక్రమాలు కల్పించాలన్నారు. మంగినపూడి బీచ్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచేందుకు, బీచ్‌లో తాగునీటి అవసరాల కోసం డిశాలినేషన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. బందరుకోటలో పురాతన కట్టడాలను పరిరక్షించి హెరిటేజ్‌ పార్కుగా అభివృద్ధి చేసే అవకాశాలు కల్పించాలన్నారు. నగరంలో పార్కుల సుందరీకరణ చేయాలన్నారు. డ్రెయినేజీ వ్యవస్థ అభివృద్ధి చేయాలన్నారు. పది డివిజన్లకు ఒక జిల్లా అధికారిని శానిటేషన్‌ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ, ఆర్డీవో స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 12:55 AM