పోలీసులు వర్సెస్ న్యాయవాదులు!
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:45 AM
జగ్గయ్యపేట సివిల్ కోర్టుల సముదాయం వద్ద బుధవారం హైడ్రామా నెలకొంది. మహిళపై దాడి కేసులో ముద్దాయిగా ఉన్న న్యాయవాదిపై కేసు నమోదు చేసిన వత్సవాయి ఎస్‌ఐ ఉమాను సస్పెండ్ చేయాలని, అక్రమ కేసును ఎత్తివేయాలని జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టగా, గ్రామంలో అశాంతిని నెలకొల్పుతూ తప్పుడు కేసులతో దౌర్జన్యానికి పాల్పడుతున్న న్యాయవాది బిక్షమయ్యను బార్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని, అతడి అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పెదమోదుగపల్లి గ్రామస్థులు, బాధిత మహిళతో కలిసి పోటీగా కోర్టు ఎదుట రిలేదీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

న్యాయవాది తరపున బార్ పోరాటం
ఎస్‌ఐని సస్పెండ్ చేయాలని లాయర్ల రిలేదీక్షలు
న్యాయవాదికి వ్యతిరేకంగా కదిలిన పెద్దమోదుగపల్లి జనం
సివిల్‌కోర్టుల వద్ద పోటాపోటీ దీక్షలు
రెండు వర్గాలతో సీఐ చర్చలు.. ఎట్టకేలకు దీక్షల విరమణ
జగ్గయ్యపేట, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : జగ్గయ్యపేట సివిల్ కోర్టుల సముదాయం వద్ద బుధవారం హైడ్రామా నెలకొంది. మహిళపై దాడి కేసులో ముద్దాయిగా ఉన్న న్యాయవాదిపై కేసు నమోదు చేసిన వత్సవాయి ఎస్‌ఐ ఉమాను సస్పెండ్ చేయాలని, అక్రమ కేసును ఎత్తివేయాలని జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టగా, గ్రామంలో అశాంతిని నెలకొల్పుతూ తప్పుడు కేసులతో దౌర్జన్యానికి పాల్పడుతున్న న్యాయవాది బిక్షమయ్యను బార్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని, అతడి అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పెదమోదుగపల్లి గ్రామస్థులు, బాధిత మహిళతో కలిసి పోటీగా కోర్టు ఎదుట రిలేదీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కోర్టు గేటు వద్ద పోటా పోటీ శిబిరాలు, గత రెండు రోజులుగా న్యాయవాదులు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి రోడ్డెక్కి ఆందోళనలు చేయటంతో పాటు కోర్టు ఎదుట దీక్షలు చేపట్టడంతో జగ్గయ్యపేట ఎస్‌ఐ పి.వెంకటేశ్వర్లు రంగంలోకి దిగి రెండు వర్గాలతో చర్చలు జరిపారు. కోర్టు ఎదుట పోలీసుల సహకారంతోనే వేరే గ్రామం నుంచి వచ్చి రిలేదీక్షలు చేస్తున్నారని న్యాయవాదులు భావిస్తుండగా, చట్ట ప్రకారం వ్యవహరించే పోలీసులపై న్యాయవాదులు ఈ విధంగా రోడ్డెక్కి ఆందోళనలు చేయటమేమిటని ఇటు పోలీసులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపధ్యంలో జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు అటు బార్ అసోసియేషన్ ప్రతినిధులతో, జగ్గయ్యపేట ఎస్సై 2 బి.ఇ.వెంకటేశ్వరరావు, పెనుగ ంచిప్రోలు ఎస్సై ఎం.ఎ్‌స.కె.అర్జున్‌లు పెదమోదుగపల్లి గ్రామ బాధితులతో చర్చలు జరిపారు. చర్చలలో న్యాయవాదులు వత్సవాయి ఎస్‌ఐ తీరు బాగాలేదని, న్యాయవాదిపై తప్పుడు కేసు పెట్టడంతో పాటు, గతంలో వేరే కేసులో వెళ్లిన ఇద్దరు న్యాయవాదుల ఎదుట ముద్దాయిలను చితక బాది దుర్బాషలాడటం, న్యాయవాదులను హోంగార్డులతో అడ్డుకున్నారని సీఐ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులతోనే అతని ప్రవర్తన అలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటో ఆలోచన చేయాలని కోరారు. పెదమోదుగపల్లి కేసులో న్యాయవాది బిక్షమయ్య పాత్రపై విచారణ చేసి, అతని పాత్ర లేదని తేలితే పేరు తొలగిస్తామని, వత్సవాయి ఎస్‌ఐపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని, రిలేదీక్షలను ఉపసంహరించుకోవాలని కోరారు. దీంతో పెదమోదుగపల్లి గ్రామస్థులు రిలేదీక్షలు తాత్కాలికంగా నిలిపివేసేందుకు అంగీకరించారు. జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు హామి ఇచ్చి వెళ్లిపోయాక న్యాయవాదులు కాసేపు రిలేదీక్షలు కొనసాగించారు. బార్ అధ ్యక్షుడు అన్నెపాగ సుందరరావు పోలీసు ఉన్నతాధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ల సూచనతోనే రిలేదీక్షలు తాత్కాలికంగా ఆపేస్తున్నామని ప్రకటించారు. సీనియర్ న్యాయవాదులు ఈవీ జగన్నాథరావు, సామినేని వెంకటేశ్వరరావు, బద్దుల వెంకట్రామయ్య, గోనేల వెంకటేశ్వర్లు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదిని సస్పెండ్ చే యాలి
బాధితురాలు రాయల కరుణ డిమాండ్
జగ్గయ్యపేట : తనపై దౌర్యన్యంగా వ్యవహరించిన న్యాయవాది బెజవాడ బిక్షమయ్య ప్రాక్టీస్ చేయకుండా బార్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పెద్దమోదుగపల్లికి చెందిన గ్రామ బాధితురాలు రాయల కరుణ డిమాండ్ చేశారు. కోర్టు వద్ద విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 24న తెలుగుదేశం పార్టీ దిమ్మెపై దాడికేసులో ఏమాత్రం సంబంధం లేని నాపై బిక్షమయ్య నానా దుర్బాషలాడుతు, మహిళ అని చూడకుండా దౌర్జన్యం చేశారని ఆరోపించారు. బిక్షమయ్య ప్రోద్భలంతో తోటకూర నాగేశ్వరరావు, కిరణ్, అంగన్వాడీ వర్కర్ మరియమ్మలు దాడిచేయగా.. వారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదని చెప్పారు.