Share News

పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:56 AM

జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పదోన్నతుల కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టారు. 497 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్యదర్శుల సీనియారిటీ జాబితాలను బుధవారం ప్రకటించారు. 547 మంది కార్యదర్శులతో సీనియారిటీ జాబితాలను బుధవారం వెల్లడించారు. గ్రేడ్‌ 1, 2, 3, 4, 5, 6 పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ జాబితాలను ప్రకటించారు.

పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు
అంగీకార పత్రాలు ఇస్తున్న పంచాయతీ కార్యదర్శులు

మచిలీపట్నం టౌన్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పదోన్నతుల కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టారు. 497 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్యదర్శుల సీనియారిటీ జాబితాలను బుధవారం ప్రకటించారు. 547 మంది కార్యదర్శులతో సీనియారిటీ జాబితాలను బుధవారం వెల్లడించారు. గ్రేడ్‌ 1, 2, 3, 4, 5, 6 పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ జాబితాలను ప్రకటించారు. ఇందులో భాగంగా ముందుగా జిల్లా స్థాయిలో 103 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పిస్తున్నారు. గ్రేడ్‌ 4లో ఉండే 77 మంది సీనియర్లకు గ్రేడ్‌ 5లో భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా గ్రేడ్‌ 2లో ఉండే 36 మందికి పదోన్నతులు కల్పించనున్నారు. ఇందుకుగాను సీనియారిటీ జాబితాలను ప్రకటించిన కార్యదర్శులకు కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు సీనియారిటీ లిస్టులోని తమ పేర్లను సరి చూసుకున్నారు. 77 మంది గ్రేడ్‌ 4 పంచాయతీ కార్యదర్శులు, 36 మంది గ్రేడ్‌ 2 కార్యదర్శులు పదోన్నతులకు విల్లింగ్‌ ఇచ్చారు. చాలాకాలం తరువాత పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పిస్తున్నారు. కాగా గ్రేడ్‌ 1,2 పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులు ప్రభుత్వం నేరుగా నిర్వహిస్తుంది. డిఎల్‌పివో సత్యనారాయణ, కార్యాలయ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2025 | 12:56 AM