Share News

ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:06 AM

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు 29వ వర్థంతిని ఈనెల 18న నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఘనంగా నిర్వహించాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు.

ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి
సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న గద్దె రామ్మోహన్‌

ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి

తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

పటమట, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు 29వ వర్థంతిని ఈనెల 18న నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఘనంగా నిర్వహించాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. పటమట అశోక్‌ నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో గురువారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజాధాని అమరావతిలో ఈనెల నుంచి అభివృద్ధి పరుగులు పెడుతుందని, సమాంతరంగా విజయవాడ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. నగరంలోని ప్రధాన సమస్యలు అన్నింటిని పరిష్కరించేందుకు సీఎం ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రూ.లక్ష చొప్పున చెల్లించి 30 మంది టీడీపీ శాశ్వత సభ్యత్వం పొందారన్నారు. ఇక నుంచి ప్రతి నెలా 9న డివిజన్‌ కమిటీ, 14న నియోజకవర్గ సమన్వయ కమిటీల సమావేశాలు నిర్వహించాలన్నారు. కూటమి నాయకులంతా సమన్వయంతో పని చేసి మేయర్‌ పీఠాన్ని కైవశం చేసుకో వాలని ఆయన సూచిం చారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, గుండు శ్రీను, గద్దె క్రాంతి కుమార్‌, కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్‌, చెన్నుపాటి ఉషారాణి, పొట్లూరి సాయిబాబు, చెన్నుపాటి క్రాంతి శ్రీ, జి.నామేశ్వర రావు, పాల్గొన్నారు.

ఫ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత: సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఎల్‌వోసీలను లబ్ధిదారులకు ఆయన అందించారు. పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు అండగా ఉంటున్నారన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 12:06 AM