Share News

ముక్త్యాల కోటిలింగ హరిహర మహాక్షేత్రం దత్తత నిలిపివేత

ABN , Publish Date - Feb 07 , 2025 | 01:16 AM

ముక్త్యాలలోని కోటిలింగ హరిహర మహాక్షేత్రాన్ని తాళ్లాయపాలేనికి చెందిన శైవక్షేత్రానికి దత్తత ఇస్తూ దేవదాయ శాఖ మాజీ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.

ముక్త్యాల కోటిలింగ హరిహర మహాక్షేత్రం దత్తత నిలిపివేత

తుదితీర్పు వచ్చేవరకు దేవదాయశాఖ పర్యవేక్షణ.. స్పష్టమైన ఆదేశాలిచ్చిన హైకోర్టు

జగ్గయ్యపేట రూరల్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ముక్త్యాలలోని కోటిలింగ హరిహర మహాక్షేత్రాన్ని తాళ్లాయపాలేనికి చెందిన శైవక్షేత్రానికి దత్తత ఇస్తూ దేవదాయ శాఖ మాజీ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. కోటిలింగ హరిహర మహాక్షేత్రాన్ని డిసెంబరు 18న తాళ్లాయపాలేనికి చెందిన శైవక్షేతాన్రికి దత్తత ఇస్తూ అప్పటి కమిషనర్‌ సత్యనారాయణ ఉత్తర్వులు ఇ చ్చారు. ఆ ఉత్తర్వులతో అప్పటి అసిస్టెంట్‌ కమిషనర్‌ సీతారామయ్య ముక్య్తాల వచ్చి ఈవో హరిదుర్గానాగేశ్వరరావుతో కలిసి 20న దత్తత కార్యక్రమాన్ని ముగిం చారు. శివస్వామికి క్షేత్రాన్ని అప్పగించారు. 21న ఆంధ్రజ్యోతిలో శివార్పణం పేరుతో కథనం వచ్చింది. దీంతో అధికారులు తప్పును సరిదిద్దుకునేందుకు తాత్కాలికంగా దత్తతను నిలిపివేయాలని మౌఖిక ఆదేశాలిచ్చి చేతులు దులుపుకొన్నారు. అప్పటి నుంచి దేవదాయ శాఖ తరఫున నిర్వహణకు దత్తత ఆర్డర్‌ ప్రతిబంధకంగా నిలిచింది. దీంతో భక్తుడు శ్రీనివాసరావు స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప నిర్వహణ కష్టమని కోర్టును ఆశ్రయించారు. కమిషనర్‌ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు దేవదాయ శాఖ పర్యవేక్షణలో ఆలయ నిర్వహణ కొనసాగాలని సూచించింది. దీంతో ఈవో హరిదుర్గానాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. 48 రోజులుగా త్రిశంకు స్వర్గంలో ఉన్న ఆలయ నిర్వహణ గాడిన పడింది.

Updated Date - Feb 07 , 2025 | 01:16 AM