జైలుకు ఎక్కువ బెయిల్‌కు తక్కువ
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:01 AM
కార్పొరేటర్‌కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మాజీ సీఎం జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలకు జన సేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ కౌం టర్ ఇచ్చారు.

జగన్‌కు జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ కౌంటర్
మచిలీపట్నం టౌన్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): కార్పొరేటర్‌కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మాజీ సీఎం జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలకు జన సేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ కౌం టర్ ఇచ్చారు. జగన్..నువ్వు జైలుకు ఎక్కువ బెయిల్ కు తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. గురువారం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కుమారుడు కాకపోతే కార్పొరేటర్‌గా కూడా గెలిచే స్థాయి జగన్‌కు లేదన్నారు. 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే జగన్, వైసీపీ నాయకుల ప్రవర్తించిన తీరు చూసి ప్రజలు ఛీకొట్టారని, అం దుకే 11 సీట్లు ఇచ్చారని విమర్శించారు. నోటి దుర దతో ఇష్టానుసారంగా మాట్లాడిన వైసీపీ నాయకులు జైలుకు వెళుతున్నారన్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే రానున్న ఎన్నిక ల్లో 11 సీట్లు కూడా రావన్నారు. నాయకులు గడ్డం రాజు, మాదివాడ రాము, వంపుగడల చౌదరి, కొట్టె వెంకట్రావు, కార్పొరేటర్ పినిశెట్టి చాయాదేవి, వేణు, కుమారి, కర్రి మహేష్ పాల్గొన్నారు.