Share News

నందిగామ చైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారి ప్రమాణస్వీకారం

ABN , Publish Date - Feb 08 , 2025 | 01:22 AM

నందిగామ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారి శుక్రవారం పదవీ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విప్‌ తంగిరాల సౌమ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

నందిగామ చైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారి ప్రమాణస్వీకారం
బాధ్యతలు స్వీకరించిన మండవ కృష్ణకుమారికి అభినందనలు తెలుపుతున్న విప్‌ తంగిరాల సౌమ్య

నందిగామ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ‘ప్రజాసామ్యబద్ధంగా నం దిగామ మునిసిపాలిటీని టీడీపీ కైవశం చేసుకుంది. నిబద్ధత, నిజాయితీ గల మండవ కృష్ణకుమారి నాయకత్వంలో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేసి నందిగామ మునిసిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుతాం.’ అని ప్రభుత్వ విప్‌ తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. నందిగామ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారి శుక్రవారం పదవీ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విప్‌ తంగిరాల సౌమ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన కృష్ణకుమారిని సౌమ్య సత్కరించారు. పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేస్తానని కృష్ణకుమారి తెలిపారు. ఎన్‌ఎ్‌సఎల్‌బీఎస్‌ ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ కోట వీరబాబు, కోగంటిబాబు, కౌన్సిలర్లు, కమిషనర్‌ రమణబాబు పాల్గొన్నారు

Updated Date - Feb 08 , 2025 | 01:22 AM