స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకోం
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:51 AM
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఒప్పుకోబోమని సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి హెచ్చరించారు.

సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి హెచ్చరిక
గుడివాడ, జనవరి 30(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తామని, అమ్మేస్తామని, మూసేస్తామని ప్రచారం చేస్తోందని, వాటిని మానుకోవాలని, ప్లాంట్ ప్రైవేటీకరణను ఒప్పుకోబోమని సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి హెచ్చరించారు. గురువారం కామ్రేడ్ సుందరయ్యభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దని ప్లాంట్ ఉద్యోగులు 1,500 రోజులు నుంచి ఆందోళన చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంపైన ఆధారపడిన కేంద్రం రూ.11,500 కోట్లు కేటాయించిందని, దీంతో కొన్ని రోజులు పరిశ్రమ నడుస్తోందని తెలిపారు.