Share News

మహిళల గుండె చప్పుడు జనసేన

ABN , Publish Date - Mar 09 , 2025 | 01:21 AM

రాష్ట్రంలో మహిళ ల సమస్యల పరిష్కారం కోసం నిస్వార్థంగా పనిచేయడం, వారికి అండగా నిలవడం వల్ల మహిళల గుండె చప్పుగా జనసేన మారిందని ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు.

మహిళల గుండె చప్పుడు జనసేన
పారిశుధ్య కార్మికులు, వీరమహిళలను సత్కరిస్తున్న జనసేన ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, అమ్మిశెట్టి వాసు తదితరులు

ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను

మొగల్రాజపురం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళ ల సమస్యల పరిష్కారం కోసం నిస్వార్థంగా పనిచేయడం, వారికి అండగా నిలవడం వల్ల మహిళల గుండె చప్పుగా జనసేన మారిందని ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తూర్పు నగర ఇన్‌చార్జి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో గాయత్రీనగర్‌లో నిర్వహించిన మహిళాదినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉదయభాను పాల్గొన్నారు. డాక్టర్‌ హారిక, హైకోర్టు న్యాయవాది కల్పన, పారిశుధ్య మహిళా కార్మికులను, వీరమహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ పీఐఐసీ డైరెక్టర్‌ మండలి రాజేష్‌, కార్పొరేటర్‌ ఉమ్మడి శెట్టి రాధిక, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివపార్వతి, సహాయ కార్యదర్శి పొతిరెడ్డి అనిత, కృష్ణా పెన్నా రీజియన్‌ కో-ఆర్డినేటర్‌ మల్లెపు విజయలక్ష్మి, పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, అంబటి రాజ్యలక్ష్మి, శ్యాంప్రసాద్‌, పలువురు వీర మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2025 | 01:21 AM