డిప్యూటీ సీఎం పవన్‌పై జగన్‌వి చిల్లర మాటలు
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:59 AM
అవనిగడ్డలో కూటమి నాయకులుగురువారం నిరసన ప్రదర్శన చేపట్టి జగన్ ఫొటోలను దహనం చేశారు.

వెంటనే పవన్‌కు క్షమాపణ చెప్పాలి..జగన్ ఫొటోలు దహనం చేసిన కూటమి నేతలు
అవనిగడ్డ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిల్లరతనంగా మాట్లాడారని, వెంటనే క్షమాపణ చెప్పాలని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు డిమాండ్ చేశారు. అవనిగడ్డలో గురువారం వారు నిరసన ప్రదర్శన చేపట్టి జగన్ ఫొటోలను దహనం చేశారు. క్ష మాపణ చెప్పకుంటే తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కొల్లూరి వెంకటేశ్వరరావు, మత్తి వెంకటేశ్వరరావు, బండే రాఘవ, గుడివాక శేషుబాబు, మాచవరపు ఆదినారాయణ, రాయపూడి వేణుగోపాలరావు, బొప్పన భాను, రాజనాల వీరబాబు, పరుచూరి దుర్గా ప్రసాద్, బచ్చు రఘునాథ్, అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, షేక్ బాబావలి, సింహాద్రి పవన్, మండలి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.