Share News

జగన్‌రెడ్డీ..సభ్యతతో మాట్లాడడం నేర్చుకో

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:36 AM

జకీయాల్లో నైతిక విలువలే ఊపిరని, కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వాటికి తిలోదకాలిచ్చి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్‌ ధ్వజమెత్తారు.

జగన్‌రెడ్డీ..సభ్యతతో మాట్లాడడం నేర్చుకో

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌పై సంస్కారం లేని మాటలు సరికాదు: బూరగడ్డ వేదవ్యాస్‌

మచిలీపట్నం టౌన్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో నైతిక విలువలే ఊపిరని, కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వాటికి తిలోదకాలిచ్చి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్‌ ధ్వజమెత్తారు. బుధవారం మచిలీపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై జగన్‌రెడ్డి మాట్లాడిన భాష ఆయన స్థా యికి తగినది కాదని, దిగజారి మాట్లాడారని అ న్నారు. భాష సంస్కారాన్ని చాటి చెబుతుందని, ప ది మందిని ఆకట్టుకునేలా ఉండాలి కానీ, బాధపెట్టేదిగా ఉండకూడదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడానికి అవకాశం కల్పించారన్నారు. పవన్‌కల్యాణ్‌ సినీరంగంలోనే కా కుండా రాజకీయ రంగంలోనూ ప్రత్యేక ముద్ర వేశారన్నారు. రాజకీయ చతురతతో బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేయడం వల్లే కేంద్రం నుంచి రాష్ట్రానికి తగిన నిదులు వస్తున్నాయన్నారు.

Updated Date - Mar 06 , 2025 | 12:36 AM