నోరు అదుపులో పెట్టుకో జగన్
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:37 AM
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌పై స్థాయి దిగజారి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు హితవు పలికారు.
11 స్థానాలకు పడిపోయినా మార్పు రాలేదా?: రాయపూడి వేణుగోపాలరావు
అవనిగడ్డ, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌పై స్థాయి దిగజారి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు హితవు పలికారు. బుధవారం అవనిగడ్డలో ఆయన మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌పై జగన్ మాట్లాడిన భాష సరికాదన్నారు. ఓట్లేసిన తెలుగు ప్రజలను అవమానపరిచేలా ఉందన్నారు. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన జగన్ దిగజారి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజల్లో విశ్వాసం కో ల్పోయి 151 నుంచి 11 స్థానాలకు పడిపోయినా ఇంకా మార్పు రాలేదా జగన్ అని నిలదీశారు.