ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:37 AM
మహి ళలు చాలా శక్తివంతు లని, వారు తలచుకుంటే వేరొకరికి ఉపాధి కల్పించ గలిగిన స్థాయికి ఎదగ గలరని భారతీయ యువ శక్తి ట్రస్ట్ చాప్టర్ చైర్మన్ పువ్వాడ మోహనరావు అన్నారు.

ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి
భారతీయ యువశక్తి ట్రస్ట్ చాప్టర్ చైర్మన్ మోహనరావు సూచన
లబ్బీపేట, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మహి ళలు చాలా శక్తివంతు లని, వారు తలచుకుంటే వేరొకరికి ఉపాధి కల్పించ గలిగిన స్థాయికి ఎదగ గలరని భారతీయ యువ శక్తి ట్రస్ట్ చాప్టర్ చైర్మన్ పువ్వాడ మోహనరావు అన్నారు. సిద్ధార్ధ మహిళా కళాశాలలో కళాశాల వాణిజ్య, మేనేజ్‌మెంట్ విభాగం, ఇన్‌స్టిట్యూషన్ ఇన్నోవేషన్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ స్టార్టప్ డే సందర్భంగా సోమవారం ఉమెన్ ఇన్ స్టార్టప్ బ్రేకింగ్ బెరిమర్స్ అండ్ బిల్డింగ్ ఎంపైర్స్ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎంట్రప్రెన్యూర్‌గా ఎదగడానికి అవకాశం ఉన్న అన్ని మార్గాలు ఉపయోగించుకుని ఇతరులకు ఉపాధిని కలిగించే స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ మేనేజర్ ఎం.శ్రీరామారావు, పొట్లూరి వెంకటేశ్వరరావు, ఆర్.లలిత, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కల్పన, స్పెషల్ ఆఫీసర్ ఆర్.మాధవి పాల్గొన్నారు.