ప్రివెంటివ్ అండ్ వెల్‌నెస్ క్లినిక్ ప్రారంభం
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:18 AM
ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కళాశాల, విజయవాడ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ జీజీహెచ్‌లో ప్రివెంటివ్ అండ్ వెల్‌నెస్ క్లినిక్‌ను గురువారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్ కుమార్, సూపరింటెండెంట్ ఏవీ రావు, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ పి.మాధవిలు ప్రారంభించారు.

ప్రివెంటివ్ అండ్ వెల్‌నెస్ క్లినిక్ ప్రారంభం
ప్రభుత్వాసుపత్రి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కళాశాల, విజయవాడ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ జీజీహెచ్‌లో ప్రివెంటివ్ అండ్ వెల్‌నెస్ క్లినిక్‌ను గురువారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్ కుమార్, సూపరింటెండెంట్ ఏవీ రావు, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ పి.మాధవిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పి.అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ క్లినిక్ ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందిస్తామన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీ రావు మాట్లాడుతూ ఈ క్ల్లినిక్ ద్వారా ప్రజలకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు, నివారణ చర్యలు, ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి సోమ, బుధవారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ రూమ్ నెంబరు 222లో వైద్యులు అందుబాటులో ఉంటారన్నారని తెలిపారు.