Share News

హోంగార్డు కుటుంబానికి ఆర్థికసాయం

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:32 AM

విధి నిర్వహ ణలో గుండెపోటుతో మరణిం చిన హోంగార్డు కుటుంబానికి నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర బాబు రూ. 5లక్షల చెక్కును గురువారం అంద జేశారు.

హోంగార్డు కుటుంబానికి ఆర్థికసాయం
హోంగార్డు కుటుంబానికి ఆర్థికసాయం అందజేస్తున్న సీపీ ఎస్‌.వి.రాజశేఖరబాబు

హోంగార్డు కుటుంబానికి ఆర్థికసాయం

గుణదల, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహ ణలో గుండెపోటుతో మరణిం చిన హోంగార్డు కుటుంబానికి నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర బాబు రూ. 5లక్షల చెక్కును గురువారం అంద జేశారు. నగర హోంగార్డు యూనిట్‌లో విధు లు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు గడచిన కొద్దికాలం క్రితం గుండెపోటుతో మృతి చెందారు. కమిషనరేట్లో పనిచేస్తున్న హోంగార్డులు మరణించినా, పదవీవిరమణ చేసినా హోంగార్డు సంక్షేమ నిధి నుంచి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. హోంగార్డు కుటుంబాలు ఆర్థికంగా బలపడేందుకు సంక్షేమనిధి నుంచి చేయూత నివ్వడం గర్వించదగిన విషయం అని సీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, హోంగార్డు ఆర్‌.ఐ కె.సుధాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 12:32 AM