Share News

పారిశ్రామిక అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jan 04 , 2025 | 01:30 AM

లబ్బీపేటలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్లో మూడు రోజుల పాటు నిర్వహించే రోటా ఫెయిర్‌ను శుక్రవారం మంత్రి టీజీ భరత్‌ ప్రారభించారు.

పారిశ్రామిక అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
రోటా ఫెయిర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి టీజీ భరత్‌

రోటా ఫెయిర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి టీజీ భరత్‌

లబ్బీపేట, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని ప్రాంతానికి పూర్వ వైభవం వచ్చింది. పారిశ్రామికంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువ పారిశ్రామికవేత్తలకు చేయూత అందించాలనే సంకల్పంతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది.’ అని పరిశ్రమలు శాఖ రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ అన్నారు. లబ్బీపేటలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్లో మూడు రోజుల పాటు నిర్వహించే రోటా ఫెయిర్‌ను శుక్రవారం అయన ప్రారభించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పరిశ్రమల అభివృద్ధికి చర్యలు శూన్యమన్నారు. మూడు రోజుల పాటు రోటా ఫెయిర్‌ జరగనుందని, సంక్రారతి పండుగ షాపింగ్‌కు రోటా ఫెయిర్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని, నగర ప్రజలు ఈ ఫెయిర్‌ను సందర్శించాలని రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ మిడ్‌ టౌన్‌ అధ్యక్షుడు గుడిపాటి కిషోర్‌ బాబు కోరారు. దీని ద్వారా లభించే నగదును పోలియో నిర్మూలన కోసం వినియోగిస్తామని తెలిపారు. రోటరీ క్లబ్‌ మిడిల్‌ టౌన్‌ కార్యదర్శి సుందర్‌ రెడ్డి, రోటా ఫెయిర్‌ ప్రోగ్రాం కమిటీ చైర్మన్లు చిన్నం మధుబాబు, అమూల్య శ్రీనివాస్‌, క్యూనిక్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత ఆనంద్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 01:30 AM