ఏజే కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:09 AM
ఆంధ్ర జాతీయ కళాశాల(ఏజే కళాశాల)ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అమరావతిలోని సచివాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర, సీపీఎం నాయకుడు కొడాలిశర్మ, శశిధర్, ఐ.దిలీ్‌పకుమార్ వినతిపత్రం అందించారు.

మచిలీపట్నం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): వందేళ్లకు పైగా ఎం దరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల(ఏజే కళాశాల)ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అమరావతిలోని సచివాలయంలో గురువారం మంత్రి కొల్లు రవీంద్ర, సీపీఎం నాయకుడు కొడాలిశర్మ, శశిధర్, ఐ.దిలీ్‌పకుమార్ వినతిపత్రం అందించారు. గత ఏడాది అక్టోబరు 2న మచిలీపట్నానికి ముఖ్యమంత్రి చం ద్రబాబు వచ్చినపుడు ఏజే కళాశాలను ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటుందని హామీ ఇచ్చారని మంత్రి రామనారాయణరెడ్డికి తెలిపారు. 1910లో హోమ్‌రూల్ ఉద్యమస్ఫూర్తితో కళాశాలను స్థాపించారని, స్వాతంత్య్ర ఉద్యమం నడపడంలోనూ ప్రముఖపాత్ర పోషించిందని వివరించారు. రెండుసార్లు మహాత్మాగాంధీ కళాశాలను సందర్శించారని, జాతీయపతాక రూపశిల్పి పింగళి వెంకయ్య ఈ కళాశాలలోనే పనిచేశారని తెలిపారు. కాలక్రమంలో ఉనికిని కోల్పోయి, ప్రైవేటు సంస్థగా మారిందని, ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలని కోరారు.