Share News

ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలి

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:17 AM

రహదారి భద్రతపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని హెల్మెట్‌లు, సీటు బెల్టులు ధరించడం ద్వారా 6 శాతం మేర రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించే వీలుందని జాతీయ రహదారుల సాధికార సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతీయ అధికారి ఆర్‌కే సింగ్‌ అన్నారు

 ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలి

రహదారి భద్రతపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలి

జాతీయ రహదారుల సాధికార సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌కే సింగ్‌

పటమట, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): రహదారి భద్రతపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని హెల్మెట్‌లు, సీటు బెల్టులు ధరించడం ద్వారా 6 శాతం మేర రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించే వీలుందని జాతీయ రహదారుల సాధికార సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతీయ అధికారి ఆర్‌కే సింగ్‌ అన్నారు. గురువారం విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా అధ్యక్షుడు నాగమోతు రాజ అధ్యక్షతన రహదారి భద్రతా సదస్సు నిర్వహించారు. రాష్ట్ర రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎ.మోహన్‌ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలను అధ్యయనం చేయడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎం.కృష్ణమూర్తి నాయుడు, ఆర్‌ఎంకే కిషోర్‌, పి.గోపాలనాయుడు, అల్లాడ సత్యనారాయణ, వాసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:17 AM