చేనేత కార్మికులకు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించండి
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:40 AM
చేనేత కార్మికులకు బడ్జెట్‌లో సరైన ప్రాధాన్యత కల్పించాలంటూ శుక్రవారం చేనేత శాఖ ఏడీ కార్యాలయం వద్ద చేనేత కార్మికులు ధర్నా నిర్వహించారు.

మచిలీపట్నం టౌన్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : చేనేత కార్మికులకు బడ్జెట్‌లో సరైన ప్రాధాన్యత కల్పించాలంటూ శుక్రవారం చేనేత శాఖ ఏడీ కార్యాలయం వద్ద చేనేత కార్మికులు ధర్నా నిర్వహించారు. కృష్ణాజిల్లా చేనేత కార్మిక సంఘ కార్యదర్శి గోరు రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ, జీఎస్టీ విధించడం వల్ల చేనేత రంగం సంక్షోభంలో పడిందన్నారు. వైసీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం కింద కార్మికులకు షెడ్లు నిర్మించలేదన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దానిని అమలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో పి.నరసింహారావు, వి.గంగాధర్, వి.లింగం, చంద్రకళ, జి. నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.