అలసత్వాన్ని వీడి పరీక్షలకు సన్నద్ధం కండి
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:20 AM
పదో తరగతి విద్యార్థులు అలసత్వాన్ని వీడాలని, ఇది ఎంతో కీలకమైన సమయమని, పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.

పదో తరగతి విద్యార్థులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులు అలసత్వాన్ని వీడాలని, ఇది ఎంతో కీలకమైన సమయమని, పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. మూలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పారు. సబ్జెక్టుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి నూరుశాతం ఫలితా లు సాధించాలని, అత్యవసరమైతే తప్ప సెలవులు పెట్టొద్దని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను ఆయన పరిశీలించారు. గణితం, సోషల్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఏడుగురు ఉపాధ్యాయులు సెలవు పెట్టడంపై ఆయన అసహ నం వ్యక్తం చేశారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న సమయంలో సెలవులు పెట్టడం సరికాదన్నారు. హెచ్‌ఎం టి.డేవిడ్ రాక్‌ఫిల్లర్, ఆర్‌ఐ జి.వరప్రసాద్, వీఆర్వో సందీప్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.