నూతన వంగడాల సృష్టితో ఆహార కొరతను అధిగమించాలి
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:18 AM
సాంకేతిక పరిజ్ఞానం, నూతన వంగడాల సృష్టితో పెరుగుతున్న జనాభాకి తగిన విధంగా పంటలను పండించి ఆహార కొరతను అధిగమించాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్ర ఆచార్యులు డాక్టర్ సీఎస్‌ఎన్ రాజు తెలిపారు.

నూతన వంగడాల సృష్టితో ఆహార కొరతను అధిగమించాలి
డాక్టర్ సీఎస్‌ఎన్ రాజు
మొగల్రాజపురం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరిజ్ఞానం, నూతన వంగడాల సృష్టితో పెరుగుతున్న జనాభాకి తగిన విధంగా పంటలను పండించి ఆహార కొరతను అధిగమించాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్ర ఆచార్యులు డాక్టర్ సీఎస్‌ఎన్ రాజు తెలిపారు. పీబీ సిద్ధార్థ కళాశాలలో ఆర్థికశాస్త్ర విభాగం జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధ, ఇతర సాంకేతికత ద్వారా డ్రాగన్‌ఫ్రూట్ తరహా ఇతర ఫలాలను మరిన్ని కనుగొనాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం-గ్రామీణాభివృద్ధి అంశంపై పరిశోధనా పత్రాలతో వెలువరించిన ఇన్నోవేషన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, సెమినార్ డైరెకర్ ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వి.బాబూరావు, డీన్ రాజేష్, ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు డాక్టర్ రోహిణి కుసుమ, డాక్టర్‌సూర్యప్రకాశరావు, రామారావు పాల్గొన్నారు.