మామిడితోట గ్రామంలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:51 AM
మల్లాయిచిట్టూరు పంచాయతీ పరిధిలోని మామిడితోట గ్రామంలో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది.

ఒక గృహం, నాలుగు చావిళ్లు, రెండు గడ్డి వాములు దగ్ధం..రూ.5.35 లక్షల ఆస్తి నష్టం
ఘంటసాల, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మల్లాయిచిట్టూరు పంచాయతీ పరిధిలోని మామిడితోట గ్రామంలో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్ల నుంచి పడిన నిప్పు రవ్వలు ఎండిన ఆకులపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న ఒక గృహానికి, దాని పక్కనే ఉన్న నాలుగు పశువుల చావిళ్లకు మంటలు వ్యాపించాయి. స్థానికులు మచిలీపట్నం అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి మం టలు అదుపు చేశారు. లోయ చిన్న శ్రీనివాసరావుకు చెందిన నాలుగు దూలాల ఇల్లు, 2 ఎకరాల గడ్డివాము దగ్ధం కాగా, రూ.3 లక్షల నష్టం వాటిల్లింది. లోయ కాశీరత్నానికి చెందిన రెండు పశువుల పాకలు, ఐదు ఎకరాల గడ్డి వామి దగ్ధం కా గా రూ.1.50 లక్షల నష్టం, లోయ సుబ్బమ్మ పశువుల చావిడి కాలిపోగా రూ.50 వేలు నష్టం, లోయ బేబీ సరోజిని పశువుల చావిడి దగ్ధం కాగా, రూ.35 వేలు నష్టం జరిగినట్లు అగ్ని మాపక శాఖాధికారులు తెలిపారు. మొత్తం రూ.5.35 లక్షల నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారులు తెలియజేశారు.