ముగ్గులొలికే..
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:45 AM
ఆకాశంలో హరివిల్లులు క్యూ కట్టినట్టు... ఇంద్రధనస్సులోని రంగులన్నీ ఇలపై ఒలికినట్టు.. అప్పటివరకు ఖాళీగా కనిపించిన ప్రాంగణాల్లో కమనీయ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.

విజయవాడలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ముత్యాల ముగ్గుల పోటీల ఫైనల్స్
ముఖ్య అతిథిగా హాజరైన హోమంత్రి వంగలపూడి అనిత
విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్, ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్) ఫైనల్స్ శనివారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని బ్యాడ్మింటన్ కోర్టులో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలతో పాటు తమిళనాడు, కర్ణాటక విజేతలు కలిపి మొత్తం 15 మంది పాల్గొన్నారు. ప్రథమ బహుమతితో పాటు మూడు ద్వితీయ బహుమతులను అందజేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా విచ్చేయగా, ఉమ్మడి కృష్ణా జిల్లాపరిషత మాజీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ జ్యోతి వెలిగించి ఫైనల్స్ పోటీలను ప్రారంభించారు. న్యాయనిర్ణేతలుగా అబ్బూరి రత్నలక్ష్మి, సూరపనేని ఉషారాణి వ్యవహరించారు.