Share News

ఉత్సాహంగా రివర్‌ క్రాస్‌ పోటీలు

ABN , Publish Date - Feb 03 , 2025 | 01:36 AM

విజయవాడ దుర్గాఘాట్‌ వద్ద ఆదివారం 25వ రివర్‌ క్రాస్‌ స్విమ్మింగ్‌ పోటీలు ఉత్సాహంగా సాగాయి.

ఉత్సాహంగా రివర్‌ క్రాస్‌ పోటీలు
జెండా ఊపి పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

వన్‌టౌన్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): విజయవాడ దుర్గాఘాట్‌ వద్ద ఆదివారం 25వ రివర్‌ క్రాస్‌ స్విమ్మింగ్‌ పోటీలు ఉత్సాహంగా సాగాయి. 600 మంది స్విమ్మర్లు పాల్గొన్నారు. దుర్గాఘాట్‌ నుంచి దక్షిణం వైపు లోటస్‌ పాండ్‌ వరకు ఒకటిన్నర కిలోమీటర్ల నిడివిలో ఈ పోటీలు జరిగాయు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా అమరావతి ఫెస్టివల్‌ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ కామినేని పట్టాభిరామయ్య, బీజేపీ నాయకుడు పాతూరి నాగభూషణం విచ్చేశారు. కార్యక్రమ కన్వీనర్‌ డాక్టర్‌ దాసరి యుగంధర్‌, ప్రెసిడెంట్‌ వెలగపూడి వెంకటేశ్వరరావు, సెక్రటరీ మందపాటి నరసారాజు, వైస్‌ ప్రెసిడెంట్‌ లింగిపల్లి రామకృష్ణ, ఉమామహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పోటీల అనంతరం ఆక్వా డెవిల్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ ప్రాంగణంలో విజేతలకు 50గ్రా, 30గ్రా వెండి నాణేలు, సర్టిఫికెట్లను అందజేశారు.

పురుషుల విభాగంలో విజేతలు వీరే...

10-15 ఏళ్ల కేటగిరీలో యశస్వి(ప్రథమ), సాగి రిషికేష్‌ వర్మ(ద్వితీయ), షణ్ముఘ రాఘవ (తృతీయ), 16-20 ఏళ్ల కేటగిరీలో సాయి నిహాల్‌(ప్రథమ), రిత్విక్‌(ద్వితీయ), కింగ్‌ జార్జ్‌(తృతీయ), 21-30 ఏళ్ల కేటగిరీలో పి.వి.సత్యనారాయణ(ప్రథమ), ఎల్‌.పి.సి.డి.ఆర్‌ సౌరత్తోర్‌(ద్వితీయ), కె.గౌతమ్‌(తృతీయ), 31-40 ఏళ్ల కేటగిరీలో తులసి చైతన్య(ప్రథమ), నాగార్జున రెడ్డి (ద్వితీయ), 41-50 ఏళ్ల కేటగిరీలో ప్రదీ్‌పకుమార్‌(ప్రథమ), శివగణే్‌ష(ద్వితీయ), శ్రీనివాసరెడ్డి (తృతీయ), 51-60 ఏళ్ల కేటగిరీలో బి.ప్రకా్‌షరావు(ప్రథమ), తులసి నాగరాజు(ద్వితీయ), జొన్నలగడ్డ రామకృష్ణ(తృతీయ), 60 ఏళ్లు పైబడిన విభాగంలో కులశేఖర్‌(ప్రథమ), మోహనరావు (ద్వితీయ), కాట్రగడ్డ అజయ్‌(తృతీయ) స్థా నాల్లో నిలిచారు.

మహిళా విభాగంలో..

10-15 ఏళ్ల కేటగిరీలో వెన్యశ్రీ(ప్రథమ), రమ్యశ్రీ(ద్వితీయ), నిషా అగర్వాల్‌(తృతీయ), 16-20 ఏళ్ల కేటగిరీలో కర్ణికగుప్తా(ప్రథమ), శాంతి(ద్వితీయ), రామలక్ష్మి(తృతీయ), 21-30 ఏళ్ల కేటగిరీలో మానస(ప్రథమ), ప్రమోదోత్తమ (ద్వితీయ), కీర్తన(తృతీయ), 31-40 ఏళ్ల కేటగిరీలో కిరణ్‌మౌనిక(ప్రథమ), డింపుల్‌ కృష్ణ(ద్వితీయ), శకుంతల దేవి(తృతీయ), 41-50 ఏళ్ల కేటగిరీలో సునీత(ప్రథమ), శృతి ప్రసాద్‌(ద్వితీ య), లక్ష్మీసౌజన్య(తృతీయ), 51-60 ఏళ్ల కేటగిరీలో ఇంద్రాణి(ప్రథమ), పదప్రియ(ద్వితీయ), సీహెచ్‌రజని(తృతీయ), 60 ఏళ్లపైన విభాగంలో పద్మప్రియ(ప్రథమ), సూర్యకాంతం(ద్వితీ య), విజయశ్రీ గుప్తా(తృతీయ)స్థానాల్లో నిలిచారు.

Updated Date - Feb 03 , 2025 | 01:36 AM