ఆక్వాలో ఎమ్మెస్సీ విద్యార్థులకు ఉపాధి మెండు
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:52 AM
సాంకేతికత విస్తరిస్తున్న ఈ రోజుల్లో యువత తమలోని నైపుణ్యాలను, తెలివి తేటలను మరింత మెరుగు పరచుకోవాలని నాగార్జున విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం హితవు పలికారు.

ఆక్వాలో ఎమ్మెస్సీ విద్యార్థులకు ఉపాధి మెండు
నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్
ప్రొఫెసర్ జి. సింహాచలం
మొగల్రాజపురం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): సాంకేతికత విస్తరిస్తున్న ఈ రోజుల్లో యువత తమలోని నైపుణ్యాలను, తెలివి తేటలను మరింత మెరుగు పరచుకోవాలని నాగార్జున విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం హితవు పలికారు. పీబీ సిద్ధార్థ జీవ,జంతు, వృక్ష శాస్త్ర విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన సియెన్షియా కార్యక్రమంలో ముఖ్య అతిఽథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆక్వా కల్చర్, హాస్పటల్ మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్‌సీ కోర్సులు చేసిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ , డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ రాజేష్ తదితరులు మాట్లాడారు. అనంతరం క్విజ్, పీపీటీ, పోస్టర్, మిస్టర్ అండ్ మిస్ సియెన్షియా, మిస్ బయో తదితర విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ డిగ్రీ కళాశాలల నుంచి 300 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.మనోరంజని, సియోన్షియా కన్వీనర్, వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పువ్వాడ శ్రీనివాసరావు, సహ సమన్వయకర్త డాక్టర్ సాంబానాయక్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ విద్యలో ఫిజిక్స్ కీలకపాత్ర
ఉన్నత విద్యలో, ముఖ్యంగా ఇంజనీరింగ్‌లో ఫిజిక్స్ ప్రాథమిక భావనలు కీలక పాత్ర పోషి స్తాయని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (డీమ్డ్ యూనివర్సిటీ) వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పి. వెంకటేశ్వరరావు చెప్పారు.పీబీ సిద్ధార్థ కళాశాల స్టూడెంట్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో సైంటిలా 6.0 కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శ్రద్ధ, ఇష్టంతో అభ్యసిస్తే ఎంతో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో క్విజ్, పీపీటీ, సైన్స్ మోడల్స్, వక్తృత్వం, సైన్స్ ట్రెజర్‌హంట్, సంగీత, నృత్య, పొటోగ్రఫీ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డీన్ రాజేష్ జంపాల, సింటిలా సమన్వయకర్త డాక్టర్ టిఎస్ శ్రీనివాసకృష్ణ, భౌతిక శాస్త్ర అధ్యాపకులు టి. పూజిత, డాక్టర్ ఎస్కే మున్వరీన్, జె.పాండురంగా రావు, ఎన్.రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.