Share News

వైద్యురాలి నిర్లక్ష్యానికి ఎనిమిది నెలల గర్భిణి మృతి

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:44 AM

వైద్యురాలి నిర్లక్ష్యానికి ఎనిమిది నెలల గర్భిణి మృతిచెందింది.

వైద్యురాలి నిర్లక్ష్యానికి ఎనిమిది నెలల గర్భిణి మృతి

మచిలీపట్నం టౌన్‌, మార్చి 5(ఆంధ్రజ్యోతి): వైద్యురాలి నిర్లక్ష్యానికి ఎనిమిది నెలల గర్భిణి మృతిచెందింది. ఈఘటన బందరులో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జరిగింది. పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన కట్టా నాగదుర్గామల్లేశ్వరి (28) ఎనిమిది నెలల గర్భిణి. నోబుల్‌ కళాశాల రోడ్డులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి పరీక్షలు చేయించుకునేందుకు మంగళవారం వచ్చారు. మధ్యాహ్నం ఉమ్మనీరు తక్కువగా ఉందని వైద్యురాలు ఒక ఇం జక్షన్‌ ఇచ్చారు. సాయంత్రం రమ్మనమని చెప్పారు. ఈలోగా ఫిట్స్‌ వచ్చి నాగదుర్గామల్లేశ్వరి పరిస్థితి విషమించింది. ఆసత్రిలోనే మృతిచెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నాగదుర్గామల్లేశ్వరికి విజయవాడకు దగ్గరలోని నైనవరానికి చెందిన నాగమురళితో వివాహమయింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. దుర్గామల్లేశ్వరి మృతిచెందడంతో భర్త మురళి కన్నీరుమున్నీరయ్యారు.

Updated Date - Mar 06 , 2025 | 12:44 AM