Share News

పారిశ్రామికంగా విజయవాడకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి

ABN , Publish Date - Feb 16 , 2025 | 01:17 AM

హైదరాబాద్‌కు దీటుగా పారిశ్రామికంగా అన్ని రంగాల్లో ముందున్న విజయవాడకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) హామీ ఇచ్చారు.

పారిశ్రామికంగా విజయవాడకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి
ఆటోనగర్‌లోని ఎంఎ్‌సఎంఈ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ ఫెసిలిటేట్‌ సెంటర్‌లో మాట్లాడుతున్న ఎంపీ కేశినేని శివనాథ్‌

ఎంపీ కేశినేని శివనాథ్‌ హామీ

ఆటోనగర్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు దీటుగా పారిశ్రామికంగా అన్ని రంగాల్లో ముందున్న విజయవాడకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) హామీ ఇచ్చారు. ఇక నుంచి రాజకీయాలు మానేద్దామని, నగర అభివృద్ధి కోసం ఆలోచిద్దామంటూ ఆటోమొబైల్‌ పారిశ్రామికవేత్తలకు ఆయన పి లుపునిచ్చారు. శనివారం ఆటోనగర్‌లోని ఆంధ్రప్రదేశ్‌ ఎంఎ్‌సఎంఈ ఇం డస్ట్రీస్‌ అసోసియేషన్‌ ఫెసిలిటేట్‌ సెంటర్‌లో రిజిస్ర్టేషన్‌ సెంటర్‌ను ప్రారంభించాక, ఆటోమొబైల్‌ ఇండస్ర్టీస్‌ అభివృద్ధి కోసం తయారు చేసిన నివేదికను ఎంపీకి ఎంఎ్‌సఎంఈ ఇండస్ర్టీస్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు డి.రామకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడారు. ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశయమన్నారు. ఆ ఆశయ సాధన కోసం విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పైలెట్‌ ప్రాజెక్టు గా 32 గ్రామాలను దత్తత తీసుకున్నానని చిన్ని ప్రకటించారు. 295 గ్రా మాలను అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. చిన్న తరహా సంస్థల ఏర్పాటులో రాష్ట్రం చాలా వెనుకబడి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశా రు. రాబోయే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య కోర్సులు విద్యాసంస్థల్లో అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఏపీ ఎంఎ్‌సఎంఈ గౌరవ అధ్యక్షు డు బాయన వెంకటరావు, అధ్యక్షుడు బీవీఎస్టీ సాయి, జనరల్‌ సెక్రటరీ ఎంఎస్‌ రామచంద్రరావు, సెక్రటరీ టీవీ నాగేశ్వరరావు, పలు సంఘాల నాయకులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 01:17 AM