నాటక పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:34 AM
అజో-విభొ-కందాళం ఫౌండేషన్, జాషువా సాంస్కృతి కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో గవర్నరుపేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో నాటక పోటీలు ప్రారంభమయ్యాయి.

నాటక పోటీలు
ప్రారంభం
విజయవాడ కల్చరల్, జనవరి 3(ఆంధ్రజ్యోతి) : అజో-విభొ-కందాళం ఫౌండేషన్, జాషువా సాంస్కృతి కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో గవర్నరుపేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో నాటక పోటీలు ప్రారంభమయ్యాయి. పలువురు నాటక రంగ, సినీ, సాహిత్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అజో-విభొ-కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారా యణ, చైర్మన్ డాక్టర్ కేవీ రామానుజాచార్యులు, జాషువా సాంస్కృతిక వేదిక కన్వీనర్ గుండు నారాయణరావు, తెలుగు డ్రామా నిర్వాహకుడు డి.రామకోటేశ్వరరావు, సినీ నటుడు వైఎస్ కృష్ణేశ్వరరావు, ఉత్సవాల ప్రిన్సిపాల్ కోఆర్డినేటర్ జీవీ రంగారెడ్డి, ప్రతినిధి చలసాని కృష్ణప్రసాద్ తదితరులు సమన్వయాన్ని అందించారు. కార్యక్రమంలో తొలి ప్రదర్శనగా అన్నదాత నాటికను కళాంజలి కళాకారులు ప్రదర్శించారు. అనంతరం వేదాంతం నాటిక ప్రదర్శించారు. మూడో ప్రదర్శనగా వర్క్ ఫ్రం హోం, రెండో ప్రదర్శనగా అనశ్వరం నాటికను ప్రదర్శించారు. ఈ నాటిక ప్రేమకు సంబంధించిన అంశాలను చూపించింది.(అ)సత్యం అనే నాటిక ప్రదర్శితమైంది. ఈ నాటికను శ్రీచైతన్య కళాస్రవంతి కళాకారులు ప్రదర్శించారు. అనంతరం విశిష్ట దళిత సాహిత్య పురస్కార ప్రదానం జరిగింది. అనశ్వరం నాటికను విజయవాడకు చెందిన శ్రీకృష్ణా ఆర్ట్ థియేటర్ ప్రదర్శించారు. మూడవ ప్రదర్శనగా బ్రహ్మస్వరూపం విజయవాడకు చెందిన మైత్రీ కళానిలయం కళాకారులు ప్రదర్శించారు.