Share News

ఎమ్మెల్సీ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దు

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:20 AM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను నాయకులు, కార్యకర్తలు తేలిగ్గా తీసుకోవద్దని పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు నీలాయపాలెం విజయకుమార్‌ సూచించారు.

ఎమ్మెల్సీ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దు
గరికపర్రులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పామర్రు నియోజకవర్గ పరిశీలకుడు విజయకుమార్‌, పక్కన వీరంకి గురుమూర్తి

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను నాయకులు, కార్యకర్తలు తేలిగ్గా తీసుకోవద్దని పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు నీలాయపాలెం విజయకుమార్‌ సూచించారు. గరికపర్రు కల్యాణ మండపంలో గురువారం బూత్‌ కన్వీనర్లు, టీడీపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్కో ఓటరును నాలుగుసార్లు ప్రత్యక్షంగా లేదా ఫోన్‌ద్వారా కలిసి ఈనెల 27న పోలింగ్‌ బూత్‌కు తీసుకొచ్చి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. తోట్లవల్లూరు మండలంలో 1309 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని, ఈ ఓటర్లు గ్రామంలో ఉన్నారా, బయట ప్రాంతంలో ఉన్నారా అని తెలుసుకుని కలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌ వీరంకి వెంకట గురుమూర్తి, టీడీపీ మండల అధ్యక్షుడు వీరపనేని శివరామ్‌ప్రసాద్‌, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి చింతపల్లి వెంకటేశ్వరరావు, రేణుకారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 01:20 AM