Share News

రీ సర్వేలో తప్పులకు తావివ్వొద్దు

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:14 AM

పొరపాట్లు, తప్పులకు తావివ్వకుండా రీ సర్వేను నిర్వహించాలని అధికారులకు కలెక్టర్‌ డీకే బాలాజీ సూచించారు.

రీ సర్వేలో తప్పులకు తావివ్వొద్దు
వేములపల్లిలో రీ సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌ బాలాజీ

అధికారులతో కలెక్టర్‌ డీకే బాలాజీ

ఘంటసాల, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): పొరపాట్లు, తప్పులకు తావివ్వకుండా రీ సర్వేను నిర్వహించాలని అధికారులకు కలెక్టర్‌ డీకే బాలాజీ సూచించారు. వేములపల్లిలో పైలెట్‌ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న భూముల రీ సర్వే ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించారు. విలేజ్‌ మ్యాప్‌, సర్వే రికార్డులను పరిశీలించారు. పంచాయతీ గ్రీన్‌ అంబాసిడర్లు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు తడి, పొడి చెత్తను వేరుగా అందించాలని గ్రామస్థులకు కలెక్టర్‌ సూచించారు. గ్రామానికి చెందిన రైతు శ్రీకాకుళం సరోజిని పొలం వద్ద ఫీల్డ్‌ విజిట్‌ నిర్వహించి, డాక్యుమెంట్లను పరిశీలించారు.

ఆక్రమణలు తొలగించాలని వినతి

తమ దళితవాడలో రహదారులు ఆక్రమణలకు గురయ్యాయని గ్రామానికి చెందిన బూసి శ్రీనివాసరావు, కళింగ రవి కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ఐదు మీటర్లు ఉండాల్సిన బజార్లు మూడు మీటర్లే ఉన్నాయని, రెండు మీటర్లన్నరలో సీసీ రోడ్లు పోశారని, అటు, ఇటు పక్క నివాస స్థలానికి చెందిన వా రు ఆక్రమించుకోవటం వల్ల గడ్డి బండి కూడా వెళ్లడం లేదని, మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని కలెక్టర్‌కు వివరించారు. తక్షణమే ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆక్రమణలు తొ లగించాలని మండల అధికారులకు కలెక్టర్‌ సూచించారు. జిల్లా సర్వే అధికారిణి ఎన్‌.జోషిల, సర్పంచ్‌ లు సూర్యదేవర వెంకాయమ్మ, గుత్తికొండ రామారావు, తహసీల్దార్‌ బి.విజయప్రసపాద్‌, ఎంపీడీవో సుబ్బారావు, ఈవోపీఆర్డీ వెంకటేశ్వరరావు, రీ సర్వే డీటీ శ్రీనివాసరావు, ఆర్‌ఐ శ్రీనివాస్‌, పంచాయతీ కా ర్యదర్శులు ఆర్‌.సురేష్‌, అబ్దుల్‌ నయీం పాల్గొన్నారు.

వక్కలగడ్డ సచివాలయం సందర్శన

చల్లపల్లి: వేములపల్లి పర్యటన ముగించుకుని వెళుతూ వక్కలగడ్డ సచివాలయాన్ని కలెక్టర్‌ బాలాజీ సందర్శించారు. రీ సర్వే రికార్డులను పరిశీలించారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌ జి.శ్రీలత, రీ సర్వే డీటీ నీలిమ, సర్వేయర్‌ పుష్పవల్లి, ఆర్‌ఐ జి.కృష్ణమోహన్‌, వీఆర్వో ప్రతిమ తదితరులున్నారు.

ధాన్యం కొనుగోలు చేయించాలని వినతి

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయించాలని వక్కలగడ్డ సచివాలయానికి వచ్చిన కలెక్టర్‌ డీకే బాలాజీకి రైతుసంఘం రాష్ట్ర నాయకుడు హనుమానుల సురేంద్రనాథ్‌ బెనర్జీ విజ్ఞప్తి చేశారు. టార్గెట్లు పూర్తయ్యాయని రైస్‌మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. ఇంకా మాసూలు చేయాల్సి న కుప్పలు చేలల్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి నివేదించామని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Feb 14 , 2025 | 01:14 AM