Share News

సమాజహిత ప్రాజెక్టులు చేయండి

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:34 AM

మీలో ఉన్న సమర్ధతతో సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులు తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ ఉమామహే శ్వరి సూచించారు.

సమాజహిత ప్రాజెక్టులు చేయండి
డ్రోన్‌ విన్యాసాలను తిలికిస్తున్న డాక్టర్‌ ఉమామహేశ్వరి తదితరులు

సమాజహిత ప్రాజెక్టులు చేయండి

ఏపీ ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరి

మొగల్రాజపురం, ఫిబ్రవరి 14 (ఆంధ్ర జ్యోతి): మీలో ఉన్న సమర్ధతతో సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులు తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ ఉమామహే శ్వరి సూచించారు. మొగ ల్రాజపురం వీరమాచనేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌లో శుక్రవారం స్కిల్‌ ఫెస్ట్‌ -2025 కార్యక్రమాన్ని ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో నిగూఢంగా ఉండే నైపుణ్యాలను ఎలా గుర్తించాలో, వాటిని ఎలా ఉపయోగించు కోవాలో సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ఆర్ట్‌, క్రాఫ్ట్‌, ఎంబ్రాయిడరీ, సైన్స్‌, సోషల్‌, మ్యాథ్స్‌, త్రీడీ చిత్ర నమూనాలను చూశారు. విద్యార్థులు డ్రోన్‌లతో చేసిన విన్యాసాలను తిలకించారు. ఈ కార్యక్రమాన్ని సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు నాగభూషణం, చనుమోలు కృష్ణారావు, జాయింట్‌ సెక్రటరీ పాఠశాల కన్వీనర్‌ సూరెడ్డి విష్ణు, అకాడమీ ఏవో ఎల్‌కే మోహన్‌రావు, కన్వీనర్‌ వెల్లంకి లలిత, కెసీపీ సిద్ధార్థ కన్వీనర్‌ శశికళ, వివిధ పాఠశాలల విద్యార్థులు తిలకించారు. ప్రిన్సిపాల్‌ మేడా సీతారామయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ రోజ్‌మేరీ, హెచ్‌ఎం సీహెచ్‌ జయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:34 AM