ఆర్థిక గణాంకాల నవీకరణతో వికసిత భారత్ సాకారం
ABN , Publish Date - Mar 09 , 2025 | 01:23 AM
పీబీ సిద్ధార్థ కళాశాల వెబినార్ హాలులో ఏపీ ఎకనామిక్ ఫోరం రెండు రోజుల పాటు నిర్వహించే 41వ వార్షిక సదస్సును మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.ఆర్.భానుమూర్తి ప్రారంభించారు.

మొగల్రాజపురం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ‘భారత దేశానిది ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 2047 నాటికి వికసిత భారత్ స్వప్నం సాకారమవ్వాలంటే రాష్ట్ర, జాతీయస్థాయిలో ఆర్థిక గణాంకాల నవీకరణ జరగాలి. ఆర్థిక వృద్ధి రేటు 8శాతం పైగా ఉండాలి.’ అని మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.ఆర్.భానుమూర్తి అన్నారు. పీబీ సిద్ధార్థ కళాశాల వెబినార్ హాలులో ఏపీ ఎకనామిక్ ఫోరం రెండు రోజుల పాటు నిర్వహించే 41వ వార్షిక సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. సంపద సృష్టి, సంక్షేమ పథకాల మధ్య సమన్వయంతో సంతులిత అభివృద్ధి సాధ్యమవుతుందని కళాశాల ప్రిన్సిపాల్, సదస్సు సమన్వయకర్త డాక్టర్ మేకా రమేష్ అన్నారు. ఏపీ ఎకనామిక్ అసోసియేషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.కృష్ణమోహన్‌రావు, అధ్యక్షుడు ప్రొఫెసర్ టీఎల్‌ఎన్ స్వామి, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సైన్సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.గలాబ్, సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు పాల్గొన్నారు. ఆర్థిక వృద్ధిపై తయారు చేసిన సావనీర్‌ను భానుమూర్తి ఆవిష్కరించారు.