రీసెర్చ్ విభాగంలో గందరగోళం
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:22 AM
కృష్ణా యూనివర్సిటీ అధికారుల తీరు నానాటికీ వివాదాస్పదంగా మారుతోంది. వర్సిటీలో వివిధ అంశాలపై పరిశోధనలు చేసుకున్న విద్యార్థులు యూనివర్సిటీకి వస్తే, వారికి సరైన సమాధానం చెప్పేవారే కరువయ్యారు. ఇప్పటికే రీసెర్చ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గైడ్‌లను కేటాయించకుండా మిన్నకుండిపోయారు. ఉద్యోగాలు చేస్తూ వివిధ ప్రాంతాల నుంచి రీసెర్చ్‌లో తమ పేరును నమోదు చేయించుకునేందుకు, గైడ్‌ల నియామకానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు యూనివర్శిటీకి వస్తే రీసెర్చ్ విభాగం కార్యాలయానికి తాళంవేసి కనిపిస్తోంది. అధ్యాపకులను వివరాలు అడిగితే, తమకేమీ తెలియదని, తరువాత రావాలని చెప్పి పంపేస్తున్నారు.

కృష్ణా యూనివర్సిటీలో 57 ఫైళ్లు మాయం
నెల రోజులకుపైగా రీసెర్చ్ విభాగం మూత
విద్యార్థులకు సమాధానం చెప్పేవారే కరువు
తర్వాత రమ్మని పంపేస్తున్న అధ్యాపకులు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీ అధికారుల తీరు నానాటికీ వివాదాస్పదంగా మారుతోంది. వర్సిటీలో వివిధ అంశాలపై పరిశోధనలు చేసుకున్న విద్యార్థులు యూనివర్సిటీకి వస్తే, వారికి సరైన సమాధానం చెప్పేవారే కరువయ్యారు. ఇప్పటికే రీసెర్చ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గైడ్‌లను కేటాయించకుండా మిన్నకుండిపోయారు. ఉద్యోగాలు చేస్తూ వివిధ ప్రాంతాల నుంచి రీసెర్చ్‌లో తమ పేరును నమోదు చేయించుకునేందుకు, గైడ్‌ల నియామకానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు యూనివర్శిటీకి వస్తే రీసెర్చ్ విభాగం కార్యాలయానికి తాళంవేసి కనిపిస్తోంది. అధ్యాపకులను వివరాలు అడిగితే, తమకేమీ తెలియదని, తరువాత రావాలని చెప్పి పంపేస్తున్నారు.
జనవరి 10న ఆర్‌అండ్‌డీ డైరెక్టర్ రాజీనామా
కృష్ణా యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్‌అండ్‌డీ) విభాగం డైరెక్టర్‌గా ఐదు నెలలుగా పనిచేస్తున్న డాక్టర్ జయశంకరప్రసాద్ తన పదవికి జనవరి 10న రాజీనామా చేశారు. ఆ పదవిని జువాలజీ, ఫిజిక్స్, కెమిసీ్ట్ర, బోటనీ విభాగాల్లో పనిచేసే అఽధ్యాపకుల్లో ఒకరికి ఇస్తారనే ప్రచారం జరిగింది. కాగా, గతంలో ఆరేళ్లు ఆర్‌అండ్‌డీ డైరెక్టర్‌గా పనిచేసిన కిరణ్‌కుమార్ అనే అధ్యాపకుడికి ఈనెలాఖరు వరకు బాధ్యతలు అప్పగించారు. కానీ, ఆయన చార్జ్ తీసుకోలేదు.
57 ఫైళ్లు మాయం
కృష్ణా యూనివర్సిటీలోని ఆర్‌అండ్‌డీ విభాగం నుంచి 2021-22 విద్యా సంవత్సరంలో కెమిసీ్ట్ర, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన 57 ఫైళ్లు మాయమయ్యాయి. ఐదు నెలల క్రితం ఆర్‌అండ్‌డీ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న జయశంకరప్రసాద్ ఈ విషయంపై యూనివర్సిటీ వీసీ, రిజిస్ర్టార్‌కు లేఖ రాశారు. వీటిపై సరైన సమాధానం చెప్పేవారే కరువయ్యారు. పరిశోధనలు పూర్తిచేసిన స్కాలర్లు.. శాసనసభ్యులు, మంత్రులతో చెప్పించుకుని పీహెచ్‌డీలు ఇప్పించాలని యూనివర్సిటీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఫైళ్లు కనిపించకుండా తామేమీ చేయలేమని అధికారులు సాచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తమ పరిశోధనలు పూర్తిచేసిన 10 మందికిపైగా స్కాలర్స్ తమ థీసిస్‌లను సమర్పిస్తామంటున్నారు. అయితే, వీరికి సంబంధించిన ఫైళ్లు మాయం కావడంతో ఏం చేస్తారో చెప్పకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు. తన ఫైళ్లు మాయం కావడంపై రంజిత అనే స్కాలర్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అతడికి గుట్టుచప్పుడు కాకుండా పీహెచ్‌డీ అందజేశారు. కృష్ణా యూనివర్సిటీ, ఆంధ్రా లయోల కళాశాల అధికారుల మధ్య పరిపాలనాపరమైన విభే దాలు వచ్చాయి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రెండేళ్లుగా కళాశాలను నడుపుతున్నారని, త్వరగా అటానమస్ అనుమతులు తీసుకోవాలని యూనివర్సిటీ అధికారులు.. లయోలా కళాశాలకు ఇటీవల నోటీసులు జారీ చేశారు. కానీ, ఈ కళాశాలలో ఫిజిక్స్, కెమిస్ర్టీ విభాగాల్లో రీసెర్చ్ స్కాలర్స్ ఆరుగురు పరిశోధనలు చేసుకునేందుకు ఖాళీలు ఉన్నాయని యూనివర్సిటీ అధికారులే చూపిస్తున్నారు. దీంతో ఆరుగురు స్కాలర్స్ దరఖాస్తు చేసుకున్నారు. కృష్ణా యూనివర్సిటీ నుంచి అనుమతులు తీసుకోని లయోలా కళాశాలకు రీసెర్చ్ విభాగంలో మాత్రం అనుమతులు ఉన్నట్టుగా చూపడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.