Share News

వీరమ్మ తిరునాళ్ల స్టాళ్లలో కోళ్ల మృతి

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:23 AM

వీరమ్మ తిరునాళ్లలో ఏర్పాటు చేసిన కోళ్లు విక్రయించే స్టాళ్లలో కొన్ని కోళ్లు మృతిచెందాయి. వాటికి బర్డ్‌ఫ్లూ లక్షణాలు అని సోషల్‌మీడియాలో గురువారం రాత్రి వైరల్‌ అయ్యింది.

వీరమ్మ తిరునాళ్ల స్టాళ్లలో కోళ్ల మృతి
కోళ్లకు పరీక్షలు చేస్తున్న పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి చిననరసింహులు

బర్డ్‌ ఫ్లూ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం.. అప్రమత్తమైన అధికారులు

ఉయ్యూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): వీరమ్మ తిరునాళ్లలో ఏర్పాటు చేసిన కోళ్లు విక్రయించే స్టాళ్లలో కొన్ని కోళ్లు మృతిచెందాయి. వాటికి బర్డ్‌ఫ్లూ లక్షణాలు అని సోషల్‌మీడియాలో గురువారం రాత్రి వైరల్‌ అయ్యింది. దీంతో శుక్రవారం ఉదయం పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి ఎన్‌.చిననరసింహులు, స్థానిక పశువైద్యశాల ఏడీ రామశేఖర్‌, ఉయ్యూరు కమిషనర్‌ పి.వెంకటేశ్వరరావు స్టాళ్ల వద్ద పరిశీలించారు. జీవించి ఉన్న కోళ్ల నుంచి రక్తము, ఇతర అవయవాల శాం పిళ్లు తీశారు. పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. బర్డ్‌ ఫ్లూ లక్షణాలు ఉంటే గుట్టలుగా కోళ్లు మృత్యువాత పడతాయని, జాలీల్లో ఉంచడంతో కోళ్లు తొక్కిసలాటకు మృతిచెంది ఉంటాయని భావిస్తున్నామన్నారు. విక్రయ స్టాళ్లు, కోళ్లు ఉంచేప్రదేశాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ శుభ్రం చేయించి బ్లీచింగ్‌, సున్నం చల్లించారు. కోళ్లు ఉంచే చోట పరిశుభ్రంగా ఉంచాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని విక్రయదారులను ఆయన ఆదేశించారు.

Updated Date - Feb 15 , 2025 | 01:24 AM