ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించండి
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:28 AM
నగర పరిధిలోని అన్న క్యాంటీన్లలో ఆహార పదార్థాల నాణ్య తను నోడల్ ఆపీసర్లు క్రమంతప్పకుండా పరిశీలించా లని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు.

వన్‌టౌన్, జనవరి 29(ఆంధ్రజ్యోతి): నగర పరిధిలోని అన్న క్యాంటీన్లలో ఆహార పదార్థాల నాణ్య తను నోడల్ ఆపీసర్లు క్రమంతప్పకుండా పరిశీలించా లని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. పర్యటనలో భాగంగా బుధవారం ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్, హెచ్‌బీ కాలనీల్లోని అన్న క్యాంటీన్లను పరిశీలించారు. కిచెన్ పరిశుభ్రతతోపాటు నిరంతరాయంగా తాగునీరు అం దించాలన్నారు. వాడుక నీటి పైప్ లైన్లలో ఎటువంటి లీకేజీ లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశిం చారు. జోనల్ కమిషనర్ రమ్యకీర్తన, చీఫ్ ఇంజనీర్ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, చీఫ్‌సిటీ ప్లానర్ ప్రసాద్, ఇంచార్జి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్‌బాబు పాల్గొన్నారు.
రేపటి వరకు ఇళ్ల రిజిస్ర్టేషన్ గడువు
చిట్టినగర్, జనవరి 29(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ జారీ చేసిన పట్టాలను గజం 100రూపాయలకే రిజిస్ట్రేషన్‌చేసుకునేందుకు వీలు కల్పించి నట్టు నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. రిజిస్ర్టేషన్‌లకు జనవరి 31 ఆఖరి తేదీ కావడంతో బుధవారం వీఎంసీ నూతన భవనంలో రిజిస్ర్టేషన్ కార్యక్రమం జరిగింది. పాయకాపురం, కొత్త రాజరాజేశ్వరిపేట ప్రాంతా లకు చెందిన లబ్ధిదారులు రిజిస్ర్టేషన్లు చేయించుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.