Share News

బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు విస్తరించాలి

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:13 AM

బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలను విస్తరింపజేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సమష్టిగా కృషి చేద్దామని జిల్లా టెలిఫోన్‌ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు విస్తరించాలి
మాట్లాడుతున్న ఎంపీ కేశినేని శివనాథ్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు విస్తరించాలి

ఎంపీ కేశినేని శివనాథ్‌

గుణదల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలను విస్తరింపజేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సమష్టిగా కృషి చేద్దామని జిల్లా టెలిఫోన్‌ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు. చుట్టుగుంటలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్లో టెలిఫోన్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రజలకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తానని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ బిజినెస్‌ విజయవాడలో బాగా జరిగేలా చేసి ఏపీలోనే ప్రథమ స్థానం కైవసం చేసుకోవడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ జీఎం కె.మురళీకృష్ణ మాట్లాడుతూ త్వరలోనే విజయవాడ బిజినెస్‌ ఏరియాలోని అన్ని టవర్లను 4జీ లోకి మార్చి ఆ తర్వాత 5జీ సేవలను కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ విజయవాడ పరిధిలోగల పలు శాఖలకు చెందిన డీజీఎంలు, ఏజీఎంలు, సీఏవోలు, ఎస్‌డీఈలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 12:13 AM