Share News

ఆప్కాస్‌ కంటే మెరుగైన విధానం తీసుకురండి

ABN , Publish Date - Feb 08 , 2025 | 01:19 AM

మంత్రి మండలి సమావేశంలో ఆప్కా్‌సను ఎత్తివేయడానికి నిర్ణయం తీసుకోవడంతో గవర్నర్‌పేటలోని రెవెన్యూభవన్‌లో శుక్రవారం అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవ ర్గం అత్యవసరంగా సమావేశమైంది.

ఆప్కాస్‌ కంటే మెరుగైన విధానం తీసుకురండి

ప్రభుత్వాన్ని కోరిన కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం

వన్‌టౌన్‌, ఫిబ్రవరి 7(ఆంరఽధజ్యోతి): ‘ఆప్కాస్‌ విధానాన్ని రద్దు చేస్తున్న ప్రభుత్వం దానికంటే మెరుగైన విధానాన్ని తీసుకురావాలి. కూటమి ప్రభుత్వంపై మేము పెట్టుకున్న ఆశలను పాలనాదక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వమ్ముచేయరని నమ్ముతున్నాం. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్వహరిస్తారని భావిస్తు న్నాం. మమ్మల్ని ఆయా శాఖలకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.’ అని కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో ఆప్కా్‌సను ఎత్తివేయడానికి నిర్ణయం తీసుకోవడంతో గవర్నర్‌పేటలోని రెవెన్యూభవన్‌లో శుక్రవారం అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవ ర్గం అత్యవసరంగా సమావేశమైంది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సుమ న్‌, ప్రధాన కార్యదర్శి అల్లం సురే్‌షబాబు, అసోసియేట్‌ అధ్యక్షుడు జి.సంపత్‌కుమార్‌, కోశాధికారి రమణమూర్తి తదితరులు మంత్రివర్గ నిర్ణయాలపై చర్చించారు. సెర్ప్‌, మెప్మా ఉద్యోగులకు కల్పిస్తున్నట్లుగానే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకూ హెచ్‌ఆర్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.

Updated Date - Feb 08 , 2025 | 01:19 AM