Share News

బంధం బంధుత్వాలను నేటితరానికి తెలపాలి: గద్దె

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:30 AM

మనుషుల మధ్య బంధాలు, బంధుత్వాలు ఉమ్మడి కుటుంబంగా ఉంటే కలిగే సంతోషాల గురించి నేటి తరానికి తెలపాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ సూచిం చారు.

 బంధం బంధుత్వాలను నేటితరానికి తెలపాలి: గద్దె
పూజలు చేస్తున్న గద్దె రామ్మోహన్‌

బంధం బంధుత్వాలను నేటితరానికి తెలపాలి: గద్దె

పటమట, ఫిబ్ర వరి 13 (ఆంధ్ర జ్యోతి): మనుషుల మధ్య బంధాలు, బంధుత్వాలు ఉమ్మడి కుటుంబంగా ఉంటే కలిగే సంతోషాల గురించి నేటి తరానికి తెలపాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ సూచిం చారు. 14వ డివిజన్‌ పటమట దర్శిపేటలోని శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవార్ల ఏసీ కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ మండపం నిర్మాణం మొదలుపెట్టిన వద్ద నుంచి ప్రారంభోత్సవం వరకు మహిళలు ముందంజలో ఉన్నారన్నారు. నిత్యం భజనలు, పూజలు, ప్రార్థనలు చేయడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ఆవుల నాసరయ్య, పోతంశెట్టి నాగేశ్వరరావు, ముమ్మనేని ప్రసాద్‌, చింతల సాంబయ్య, రావి సౌజన్య, నర్రా కిషోర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 12:30 AM