సూర్య ఘర్‌పై అవగాహన పెంచాలి
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:42 AM
సూర్య ఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మెప్మా ఏపీడీ పి.సాయిబాబు సూచించారు.

అవనిగడ్డ రూరల్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): సూర్య ఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మెప్మా ఏపీడీ పి.సాయిబాబు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సూర్య ఘర్ పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ వ్యక్తిగత నివాసం, సామూహిక గృహ కామన్ సర్వీసులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. మీటర్ అమర్చిన తర్వాత వినియోగదారులు పోర్టల్‌లో బ్యాంక్ వివరాలు అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ పథకం కింద యూనిట్ రూ.2.17 పైసలకు లభ్యమవుతుందని, దీనిలో 90 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. అధికారులు, సిబ్బంది ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు.