ముక్కోటికి టీటీడీ ఆలయంలో ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 10 , 2025 | 12:41 AM
ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని ఆలయాలు సిద్ధమయ్యాయి. లబ్బీపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, టీటీడీ కల్యాణ మండపంలోని శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీకి తగినట్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ముక్కోటికి టీటీడీ ఆలయంలో ఏర్పాట్లు
లబ్బీపేట, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని ఆలయాలు సిద్ధమయ్యాయి. లబ్బీపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, టీటీడీ కల్యాణ మండపంలోని శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీకి తగినట్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉదయం 5గంటల నుంచే భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పిస్తామని, తీర్థ ప్రసాదాలు అందజేస్తామని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా అవసరమైన భద్రత ఏర్పాట్లు పోలీసులు కల్పిస్తున్నారని, వాహ నాల పార్కింగ్‌కు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.