అల..కృష్ణాతీరాన
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:15 AM
ఆధ్యాత్మిక కేంద్రాలకు ఆరామం.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నెలవైన పవిత్ర కృష్ణానదీ తీరం వెంబడి ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్న జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఈ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ కృష్ణా తీరప్రాంతాన్ని టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -కంచికచర్ల - ఆంధ్రజ్యోతి

పశ్చిమ కృష్ణా తీరం..టెంపుల్ టూరిజానికి అనుకూలం
జగ్గయ్యపేట నుంచి ముక్త్యాల మీదుగా పరిటాల వరకు పుణ్యక్షేత్రాలు
ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రజల ఆకాంక్ష
పవిత్ర కృష్ణానది ఉత్తర వాహిని ముక్త్యాల క్షేత్రం
పడమటి కనుమల్లో పుట్టిన కృష్ణమ్మ తూర్పుగా ప్రవహిస్తూ జగ్గయ్యపేట మండలం ముక్త్యాల దగ్గర ఉత్తర దిశగా మరలి మరలా తూర్పుగా ప్రవహిస్తుండటంతో ఈ క్షేత్రం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ ఉత్తర వాహినిలో స్నానమాచరిస్తే కాశీలో స్నానమాచరించిన పుణ్యఫలం దక్కుతుందన్నది పురాణగాథ. ఈ క్షేత్రంలో రెండు భవాని ముక్తేశ్వరస్వామి దేవాలయాలు ఉన్నాయి. కృష్ణానది గర్భంలో ఒకటి. గ్రామంలో మరొకటి ఉన్నాయి. కృష్ణానదిలోని దేవాలయం ఆరు మాసాలు నీటిలో మునిగి ఉంటుంది. ఆ సమయంలో దేవతలు అక్కడ పూజలు చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, బ్రహ్మరుషి వశిష్ఠుడు సందర్శించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. భరద్వాజ మహారుషి ఈ క్షేత్రంలో పూజలు నిర్వహించి కృష్ణానది ఆవలి ఒడ్డు గుంటూరు జిల్లాలో అశ్రమాన్ని ఏర్పాటు చేశారని ప్రతీతి. ముక్త్యాల క్షేత్రాన్ని గురించి, క్షేత్ర ప్రాసస్థ్యం గురించి బ్రహ్మాండ పురాణంలో భీమసేన జాతకం, నెరవణి జాతకం, నాగార్జునుడు రచించిన రసరత్నాకరం అనే గ్రంథాల్లో లిఖించబడి ఉంది. ఈ క్షేత్రంలో భవానీ ముక్తేశ్వరస్వామి స్ఫటిక లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. కోరిన కోర్కెలు తీరుస్తుంటాడని ప్రతీతి. ఇక్కడి నుంచి బయలుదే రే కృష్ణమ్మ దిగువన సముద్రంలో కలస్తుంది.
కోటిలింగ హరిహర మహాక్షేత్రం
ముక్త్యాల క్షేత్రంలో 2006లో కంచికచర్ల మాజీ సర్పంచ్ స్వర్గీయ గద్దె ప్రసాద్-పావని దంపతుల ఆధ్వర్యంలో కోటిలింగ హరిహర మహాక్షేత్రాన్ని నిర్మించారు. శివకేశవులకు భేదం లేదని చాటి చెప్పే విధంగా పంచముఖ అమృతలింగేశ్వరస్వామితోపాటు వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించారు. నాలుగు ద్వారాలు, నాలుగు ధ్వజస్తంభాలు, విశాలమైన ముఖమండపంతో 108 ఉప ఆలయాలతో నిర్మించిన ఈ దేవాలయంలో భక్తులు స్వయంగా శివలింగ ప్రతిష్ఠ చేసుకునే అవకాశం ఉంది.
కంచికచర్ల శివసాయి క్షేత్రం
కంచికచర్ల సర ్పంచ్ స్వర్గీయ గద్దె ప్రసాద్, పావని దంపతులు 2004లో బైపాస్ రోడ్డులో శివసాయి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రంలో శివాలయం ప్రత్యేక ఆకర్షణ. గణేశ, పార్వతీ సహిత అస్టోత్తర శత లింగాత్మక మహా శివలింగం ఇక్కడ తప్ప మరే క్షేత్రంలో లేదని అంటున్నారు. దీనికి తోడు క్షేత్రం ముందు భాగంలో నిర్మించిన శివలింగాకారం కట్టడం నుంచి భక్తులు క్షేత్రం లోపలకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ అయ్యప్పస్వామి, షిరిడి సాయిబాబా, పంచముఖ హనుమాన్, జ్ఞాన సరస్వతి, నాగేంద్ర, వీరభద్ర, కాలభైరవ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. ఇంకా చిల్లకల్లు సమీపంలో తిరుమలగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయం, నందిగామ మునేటి అవతల పల్లగిరి గట్టుపై గల త్రిశక్తి పీఠంతో పాటుగా పలు దేవాలయాలు చూడదగినవి ఉన్నాయి.
వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయం
దక్షిణాది రాష్ర్టాల్లో వేదాద్రి యోగానంద లక్ష్మీనృసింహస్వామి ఆలయం పంచ నరసింహక్షేత్రంగా వెలుగొందుతోంది. వేదాలు కొండల రూపంలో అవతరించడంతో దీనికి వేదాద్రి అని పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రంలో స్వామి ఐదు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటారు. వేదాద్రి కొండపై వెలసిన జ్వాలా నరసింహుడు స్వయంవ్యక్తంగా, కృష్ణానది గర్భంలో కొలువైన సాల గ్రామ నరసింహుడు బ్రహ్మ ప్రతిష్ఠగా, గరుడాచలం గుహలో కొలువైన వీర నరసింహుడు గరుడ ప్రతిష్ఠగా, ఆలయంలో కొలువైన యోగానంద నరసింహుడు రుష్య శృంగ మహాముని ప్రతిష్ఠగా, దేవాలయంలో లక్ష్మీ నరసింహుడు మానవ ప్రతిష్ఠగా పురాణ ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది.
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం
పెనుగంచిప్రోలులో పవిత్ర మునేటి తీరాన గోపయ్య సమేత, తిరుపతమ్మ పుణ్యక్షేత్రం ఉంది. తిరుపతమ్మ భర్త గోపయ్య గోవులను మేపటానికి ఉత్తరారణ్యానికి వెళ్లగా, పెద్దపులి చంపేసింది. భర్త చనిపోయాడని కల ద్వా రా తిరుపతమ్మకు తెలిసింది. భర్త వియోగాన్ని తట్టుకోలేక యోగాగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధపడింది. స్థానిక పెద్దలు అంగీకరించకపోవడంతో ఆమె మహిమలు చూపించి, ఇక్కడే గుడి కట్టాలని చెప్పి, యోగాగ్ని ప్రవేశం చేసింది. విశిష్ట ఆచార సంప్రదాయాలతో అనునిత్యం అశేష భక్తులతో పూజలందుకుంటూ ఈ క్షేత్రం మరో కలియుగ వైకుంఠమై విరాజిల్లుతోంది. ఏటా మాఘ శుద్ద పౌర్ణమి నుంచి ఐదు రోజులు పెద్ద తిరునాళ్లు, అమ్మవారి కల్యాణం కనులపండుగగా నిర్వహిస్తారు. పాల్గుణ శుద్ధ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు చిన తిరునాళ్లు జరుగుతాయి.

కూటమి ప్రభుత్వమైనా టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలి
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నుంచి గుంటూరు జిల్లా అమరావతి మీదుగా ముక్త్యాల వరకు ఏడాది పొడవునా ప్రత్యేకంగా బోట్లు నడపాలని నిర్ణయించారు. దీంతో పర్యాటక రంగం అభివృద్ధి చెంది, ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందటానికి దోహదపడుతుందని, రాజధానికి అవసరమైన సిమెంట్, కంకర ఇతర ముడిపదార్థాల రవాణాకు ఉపయోగపడుతుందని భావించారు. విజయవాడ, అమరావతి, ముక్త్యాల వద్ద ప్రత్యేకంగా జెట్టీలు నిర్మించాలని ప్రతిపాదించారు. వేసవిలోనూ నదిలో బోటు తిరిగేలా తగినంత నీరు ఉండేలా అప్పట్లో డ్రెడ్జర్‌తో కొంతమేర పూడిక తీయించారు. వైసీపీ ప్రభుత్వమొచ్చాక ఈ ప్రాజెక్టును పూర్తిగా విస్మరించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.