Share News

లయోలా కళాశాలపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Mar 09 , 2025 | 01:24 AM

ఆంధ్ర లయోలా కళాశాల అటానమస్‌ పేరుతో ఎన్నో అవకతవకలకు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని, ప్రభుత్వం కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యుడు స్వర్గం దుర్గారావు డిమాండ్‌ చేశారు.

లయోలా కళాశాలపై చర్యలు తీసుకోవాలి
నిరసన తెలుపుతున్న ఏబీవీపీ నాయకులు

అటానమస్‌ పేరుతో అవకతవకలకు పాల్పడుతోందని ఏబీవీపీ నిరసన

భారతీనగర్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర లయోలా కళాశాల అటానమస్‌ పేరుతో ఎన్నో అవకతవకలకు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని, ప్రభుత్వం కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యుడు స్వర్గం దుర్గారావు డిమాండ్‌ చేశారు. అటానమస్‌ స్టేటస్‌ ముగిసినా రిటెయిన్‌ చేసుకోలేదని, ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తే దరఖాస్తు పెట్టామని మాట దాటేస్తూ యాజమాన్యం తప్పించుకుంటుదని అన్నారు. ఏబీవీపీ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో శనివారం కళాశాల ఎ దుట నాయకులు నిరసన తెలిపారు. ఇటీవల కృష్ణా విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టులో కళాశాల తప్పులను తెలియజేసిందన్నారు. ఇంకా ఇలాగే కొనసాగితే వందల ఎకరాలు విరాళంగా ఇచ్చిన దాతల ఆశలను సమాధి చేసినట్లు అవుతుందన్నారు. గత ఏడాది ఐబీఎం కంపెనీతో కొలాబరేషన్‌ ఉందంటూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులో విద్యార్థులతో రూ.లక్ష అదనంగా కట్టించుకుని మోసం చేసిందన్నారు. నగర సిటీ జాయింట్‌ సెక్రటరీ వసీం, కార్యకర్తలు హనీఫ్‌, విజయ్‌, వంశీ పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2025 | 01:24 AM