Share News

ఆలపాటిని భారీ మెజార్టీతో గెలిపించండి

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:48 AM

కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని ఎంపీ కేశినేని శివనాథ్‌ అన్నారు.

ఆలపాటిని భారీ మెజార్టీతో గెలిపించండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ కేశినేని శివనాథ్‌

వన్‌టౌన్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని ఎంపీ కేశినేని శివనాథ్‌ అన్నారు. గురునానక్‌ కాలనీలోని ఎన్టీఆర్‌ భవన్‌లో బుధవారం జరిగిన టీడీపీ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గెలుపు ఖాయమైందని, అయితే అత్యధిక మెజార్టీ రావడం కోసం కృషి చేయాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 10 వేల మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందుకు సంబంధిత యూనిట్ల ఇన్‌చార్జిలకు అభినందనలు తెలిపారు. అందరినీ పోలింగ్‌ బూత్‌కు తీసుకువచ్చి ఓటు వేసేలా చూడాలన్నారు. ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు ఓటర్‌ వెరిఫికేషన్‌, ఐడెంటిఫికేషన్‌ వంటి సమాచారాన్ని సేకరించి ప్రచారంపై దృష్టి పెట్టాలన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా మాట్లాడుతూఎమ్మెల్సీ ఎన్నికలు తేలికగా తీసుకోకుండా, ఎన్నికల్లో ఓటింగ్‌ విభిన్నంగా ఉంటుందని మొదటి ప్రాధాన్యత ఓటును రాజేంద్ర ప్రసాద్‌కే వేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, ఎం.ఎస్‌.బేగ్‌, షేక్‌ ఆశ, ఉమ్మడి చంటి, కార్పొరేటర్‌ల్‌ హర్షద్‌, మైలవరపు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 12:48 AM