Share News

కోటి ఎక్కడ?

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:34 AM

ముదునూరు సత్యవర్థన్‌ కేసులో మిగిలిన నిందితులు ఎక్కడున్నారు? ముఖ్యంగా సత్యవర్థన్‌ను బెదిరించి, కిడ్నాప్‌కు రంగం సిద్ధం చేసిన వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మా కోట్లు అలియాస్‌ కోటి ఎక్కడ దాక్కున్నాడు? వంశీ కేసులో ఉదయిస్తున్న ప్రశ్నలివి. సత్యవర్థన్‌ కేసులో పటమట పోలీసులు వంశీతో పాటు నలుగురిని అరెస్టు చేశారు. దీంతో నిందితుల సంఖ్య ఐదుకు చేరింది.ముదునూరు సత్యవర్థన్‌ కేసులో మిగిలిన నిందితులు ఎక్కడున్నారు? ముఖ్యంగా సత్యవర్థన్‌ను బెదిరించి, కిడ్నాప్‌కు రంగం సిద్ధం చేసిన వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మా కోట్లు అలియాస్‌ కోటి ఎక్కడ దాక్కున్నాడు? వంశీ కేసులో ఉదయిస్తున్న ప్రశ్నలివి. సత్యవర్థన్‌ కేసులో పటమట పోలీసులు వంశీతో పాటు నలుగురిని అరెస్టు చేశారు. దీంతో నిందితుల సంఖ్య ఐదుకు చేరింది.

కోటి ఎక్కడ?
వంశీ చేయి పట్టుకుని నడుస్తున్న కొమ్మా కోట్లు (ఫైల్‌)

సత్యవర్థన్‌ కేసులో కీలక నిందితుడు

వంశీకి ప్రధాన అనుచరుడు

ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

మిగిలిన వారి కోసం కొనసాగుతున్న వేట

విజయవాడ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : ముదునూరు సత్యవర్థన్‌ కేసులో మిగిలిన నిందితులు ఎక్కడున్నారు? ముఖ్యంగా సత్యవర్థన్‌ను బెదిరించి, కిడ్నాప్‌కు రంగం సిద్ధం చేసిన వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మా కోట్లు అలియాస్‌ కోటి ఎక్కడ దాక్కున్నాడు? వంశీ కేసులో ఉదయిస్తున్న ప్రశ్నలివి. సత్యవర్థన్‌ కేసులో పటమట పోలీసులు వంశీతో పాటు నలుగురిని అరెస్టు చేశారు. దీంతో నిందితుల సంఖ్య ఐదుకు చేరింది. వంశీ చెప్పిన ప్రణాళికను అమలు చేసిన కొమ్మా కోట్లు కోసం పోలీసులు గాలిస్తున్నారు. సత్యవర్థన్‌ను ట్రాప్‌లోకి దింపి బెదిరించడంలో అతడు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. తాజాగా వంశీ పీఏ ఘంటా వీర్రాజు, కారు డ్రైవర్‌ వంశీబాబును పోలీసులు అరెస్టు చేశారు. కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉన్నట్టుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఇందులో ఐదుగురికి పోలీసులు సంకెళ్లు వేశారు. మిగిలిన నిందితుల పేర్లు బయటకొస్తే వారు పరారయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

రెండో కేసు ఉన్నట్టేనా..?

వల్లభనేని వంశీ, ఆయన అనుచరులపై పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇందులో క్రైం నెంబరు 86/2025ను పట్టాలెక్కించారు. ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో సత్యవర్థన్‌ సోదరుడు కిరణ్‌ ఫిర్యాదుదారుడిగా ఉన్నాడు. ఇదికాకుండా క్రైం నెంబరు 84/2025తో మరో కేసును పోలీసులు నమోదు చేశారు. టీడీపీకి చెందిన బీసీ, ఎస్సీ, మైనారిటీ నాయకులు చేసిన ఫిర్యాదుపై ఈ కేసును నమోదు చేశారు. ఒక కేసులో అరెస్టులు కొంతవరకు జరగడంతో, రెండో కేసును పోలీసులు పైకి తీస్తారా లేదా అనే ప్రశ్న వస్తోంది. ఓపక్క మొదటి కేసులో మిగిలిన నిందితుల కోసం వేట సాగిస్తున్న పోలీసులు, ప్రధాన నిందితుడు వంశీని కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పిటిషన్‌ను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో శుక్రవారం దాఖలు చేశారు. వాస్తవానికి వంశీతో పాటు మిగిలిన ఇద్దరు నిందితులను పోలీసులు నాల్గో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిసే్ట్రట్‌ కోర్టులో హాజరుపరిచారు. కస్టడీ పిటిషన్‌ను పోలీసులు ఈ కోర్టులోనే దాఖలు చేయాల్సి ఉంటుంది. వంశీ కేసులో అట్రాసిటీ సెక్షన్లు ఉండటంతో కస్టడీకి ఇవ్వాలా వద్దా అనే నిర్ణయాన్ని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు నిర్ణయిస్తుంది. ఈ కారణంగా పోలీసులు కస్టడీ పిటిషన్‌ను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో దాఖలు చేశారని తెలుస్తోంది. వంశీ అరెస్టు ప్రభావంతో కేసులో ఉన్న నిందితులు రాష్ట్ర సరిహద్దులు దాటినట్టు ప్రచారం జరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానంతో వారి ఆచూకీని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:34 AM