Share News

కనకదుర్గమ్మకు రూ.2.28 కోట్ల కానుకలు

ABN , Publish Date - Feb 07 , 2025 | 01:10 AM

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం మహామండపం ఆరో అంతస్థులో లెక్కించారు.

కనకదుర్గమ్మకు రూ.2.28 కోట్ల కానుకలు

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం మహామండపం ఆరో అంతస్థులో లెక్కించారు. ఈ ఏడాది జనవరి 21 నుంచి ఈనెల 5వరకు 16 రోజులకు నగదు రూ.2,28,81,128, బం గారం 328 గ్రాములు, వెండి 3 కిలోల 480 గ్రాములు, విదేశీ కరెన్సీ 158 యూఎ్‌సఏ డాలర్లు, 5 సౌదీ రియాల్స్‌, 130 యూఏఈ ధీర్హమ్స్‌, 115 కెనడా డాలర్లు, 55 సింగపూర్‌ డాలర్లు, 65 ఇంగ్లండ్‌ పౌండ్లు, ఒక ఖతర్‌ రియాల్‌, 2000 ఒమన్‌ బైసాలు, ఒక రియాల్‌, 30.5 కువై ట్‌ దీనార్లు, ఆన్‌లైన్‌ ద్వారా రూ.78,333 కానుకల రూపేణా సమకూరింది. ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్‌, డిప్యూటీ ఈవో రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 01:10 AM