పేకాట ఆడతున్న 13 మంది అరెస్టు
ABN , Publish Date - Jan 31 , 2025 | 01:10 AM
ముదునూరులో పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టుచేసినట్టు రూరల్ పోలీసులు తెలిపారు.
ఉయ్యూరు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ముదునూరులో పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టుచేసి వారి నుంచి రూ.13,850 స్వాధీనపరుచుకున్నట్టు రూరల్ పోలీసులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి ఎస్సీ కాలనీకి వెళ్లే దారిలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం రావడంతో శిబిరంపై దాడిచేసినట్టు వారు తెలిపారు.