Share News

16న గుడివాడలో 10కే రన్‌

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:19 AM

ఈనెల 16న నిర్వహించనున్న 10కే రన్‌ను విజయవంతం చేయాలని ఎన్‌టిఆర్‌ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు కోరారు.

16న గుడివాడలో 10కే రన్‌

గుడివాడ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): పర్వతనేని జగన్మోహనరావు 20వ వర్ధంతి సందర్భంగా ఈనెల 16న నిర్వహించనున్న 10కే రన్‌ను విజయవంతం చేయాలని ఎన్‌టిఆర్‌ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు కోరారు. గురువారం స్టేడియం కమిటీ కార్యాలయంలో పోలీసు సీఐలతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ట్రాఫిక్‌ ఆంక్షలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సమావేశంలో స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్‌, సీఐలు కొండపల్లి శ్రీనివాస్‌, సీహెచ్‌ నాగప్రసాద్‌, ఎస్‌ఎల్‌ఆర్‌ సోమేశ్వరరావు, కమిటీ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 01:19 AM