Share News

8 నుంచి కేఎల్‌యూలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

ABN , Publish Date - May 07 , 2025 | 04:53 AM

కేఎల్‌ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం 8 నుంచి 11 తేదీ వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. ప్రవేశానికి కేఎల్‌ పరీక్ష ర్యాంకులు, ఇంటర్‌ మార్కులు, జేఈఈ పర్సెంటైల్ ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని ప్రకటించారు

8 నుంచి కేఎల్‌యూలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

  • కేఎల్‌ఈ ప్రవేశపరీక్ష ర్యాంకర్లతోపాటు ఇంటర్‌ మార్కులు, జేఈఈ పర్సెంటైల్‌ ఆధారంగా మెరిట్‌ అడ్మిషన్లు

తాడేపల్లి (వడ్డేశ్వరం), మే 6(ఆంధ్రజ్యోతి): కేఎల్‌ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్‌ క్యాంప్‌సలలో ఇంజనీరింగ్‌ కోర్సులలో ప్రవేశాలకు ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జె.శ్రీనివాసరావు తెలిపారు. 8వ తేదీ ఉదయం 9.30 గంటలకు కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందని జాతీయ స్థాయిలో నిర్వహించిన కేఎల్‌ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలో 30 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులు, స్పోర్ట్స్‌, ఎన్‌సీసీ, సాంస్కృతికం, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ కోటాతో పాటు ఓపెన్‌ కేటగిరీలో ఇంటర్‌లో 80 శాతం పైగా మార్కులు పొందిన విద్యార్థులు మొదటి రోజు కౌన్సిలింగ్‌లో పాల్గొంటారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


9, 10, 11 తేదీల్లో కేఎల్‌ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలో 30 వేలకు పైగా వచ్చిన ర్యాంకర్లు, ఓపెన్‌ కేటగిరీ కింద ఇంటర్‌, జేఈఈలలో మెరిట్‌ మార్కులు వచ్చిన విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. కౌన్సెలింగ్‌ ద్వారా సులువుగా అడ్మిషన్స్‌ ప్రక్రియ పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. మెరిట్‌ విద్యార్థులకు స్కాలర్‌షి్‌పలు కూడా అందిస్తున్నట్టు కౌన్సెలింగ్‌ కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ సుమన్‌ పేర్కొన్నారు.

Updated Date - May 07 , 2025 | 04:53 AM