Share News

YS Vivekananda Reddy: సాక్షి టీవీ యాజమాన్యం, జగనన్న కనెక్ట్స్‌ ఎక్స్‌ ఖాతాపై కేసు

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:25 AM

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పోలీసులు కొట్టడం వల్లనే రంగన్న చనిపోయాడంటూ పలుమార్లు సాక్షి చానెల్‌లో స్ర్కోలింగ్‌ వేశారు.

 YS Vivekananda Reddy: సాక్షి టీవీ యాజమాన్యం, జగనన్న కనెక్ట్స్‌ ఎక్స్‌ ఖాతాపై కేసు

‘రంగన్న’ మృతిపై తప్పుడు స్ర్కోలింగ్‌

కడప క్రైం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ప్రధాన సాక్షి వాచ్‌మన్‌ రంగన్న మూడు రోజుల క్రితం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన భర్త మృతిపై అనుమానం ఉందంటూ రంగన్న భార్య సుశీల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పోలీసులు కొట్టడం వల్లనే రంగన్న చనిపోయాడంటూ పలుమార్లు సాక్షి చానెల్‌లో స్ర్కోలింగ్‌ వేశారు. పోలీసు ప్రతిష్ఠ దిగజారేలా ఆ చానెల్‌ అసత్య ప్రచారం చేసిందంటూ కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాక్షి చానెల్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు చిన్నచౌకు పోలీసులు తెలిపారు.


అలాగే ‘జగనన్న కనెక్ట్స్‌’ అనే ఎక్స్‌ ఖాతాపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. రంగన్న చనిపోయిన రోజు ‘వైఎస్‌ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మన్‌ రంగయ్య మృతికి పోలీసులే కారణం.. వైఎస్‌ వివేకా వాచ్‌మన్‌ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు’ అంటూ సాక్షిలో వచ్చిన క్లిప్పింగ్‌ను ట్యాగ్‌ చేయడంతో పాటు ‘వైఎస్‌ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మాన్‌ రంగయ్య మృతికి పోలీసులే కారణం. పోలీసులు రంగయ్య కీళ్లు విరగ్గొట్టారు. పోలీసుల వేధింపులతోనే నా భర్త చనిపోయాడు- రంగయ్య భార్య సుశీలమ్మ’ అంటూ జగనన్న కనెక్ట్స్‌ ఖాతా ద్వారా ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనిపైనా చిన్నచౌకు పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి

PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ

PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..

Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2025 | 03:25 AM