Bail petition: బెయిల్ పిటిషన్లు ఉపసంహరణ
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:31 AM
ఈ కేసులో ఏ3, ఏ4 నిందితులుగా ఉన్న పొమిల్ జైన్, విపిన్ జైన్ తమ బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. మంగళవారం తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో ఈ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉండగా ఆ ఇరువురూ బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

కల్తీ నెయ్యి కేసులో అనూహ్య పరిణామం
పిటిషన్లు వెనక్కి తీసుకున్న ఇద్దరు నిందితులు
మరో నిందితుడి పిటిషన్, సిట్ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
తిరుపతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ3, ఏ4 నిందితులుగా ఉన్న పొమిల్ జైన్, విపిన్ జైన్ తమ బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. మంగళవారం తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో ఈ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉండగా ఆ ఇరువురూ బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ బెయిల్ పిటిషన్‌ను సోమవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. మిగిలిన ఏ3, ఏ4, ఏ5 నిందితుల బెయిల్ పిటిషన్లపై మంగళవారం విచారణ జరగాల్సిన తరుణంలో ఏ3, ఏ4 నిందితుల తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వెనక్కు తీసుకుంటున్నట్టు కోర్టుకు నివేదించారు. ఇక ఏ5 నిందితుడు అపూర్వ వినయ్‌కాంత్ చావడా బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేయాలని న్యాయవాదులు కోరిన మీదట తదుపరి విచారణను జడ్జి గురువారానికి వాయిదా వేశారు. కాగా ఏ3, ఏ5 నిందితుల కస్టడీ కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా మంగళవారం జరగాల్సిన విచారణ వాయిదా పడింది. నిందితుల తరఫు న్యాయవాదులు అభ్యర్థన మేరకు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
For National News And Telugu News